Andhra Pradesh: ఏపీలో సినిమా టికెట్ల ధరలు పెంచుతూ కొత్త జీవో జారీ, మూడు కేటగిరిలో టిక్కెట్ల ధరలను నిర్ణయించిన జగన్ సర్కారు, సవరించిన టికెట్ల ధరల వివరాలు ఇవే..

ఏపీలో సినిమా టికెట్ల ధరలను సవరిస్తూ జగన్ ప్రభుత్వం (Andhra Pradesh Govt) ఉత్తర్వులు జారీ చేసింది. మూడు కేటగిరిలో టిక్కెట్ల ధరలను (Hike Cinema Tickets Price) నిర్ణయించింది. 4 రకాలుగా టిక్కెట్ల రేట్లను ప్రభుత్వం (Govt) నిర్ణయించింది.

AP Government logo (Photo-Wikimedia Commons)

Amaravati, Mar 7: ఏపీలో సినిమా టికెట్ల ధరలను సవరిస్తూ జగన్ ప్రభుత్వం (Andhra Pradesh Govt) ఉత్తర్వులు జారీ చేసింది. మూడు కేటగిరిలో టిక్కెట్ల ధరలను (Hike Cinema Tickets Price) నిర్ణయించింది. 4 రకాలుగా టిక్కెట్ల రేట్లను ప్రభుత్వం (Govt) నిర్ణయించింది. కార్పొరేషన్లలో నాన్‌ ఏసీ థియేటర్లలో నాన్‌ ప్రీమియం రూ.40, ప్రీమియం రూ.60, కార్పొరేషన్లలో ఏసీ థియేటర్లలో నాన్‌ ప్రీమియం రూ.70, ప్రీమియం రూ.100, కార్పొరేషన్లలో స్పెషల్‌ థియేటర్లో నాన్‌ ప్రీమియం రూ.100, ప్రీమియం రూ.125, కార్పొరేషన్లలో మల్టీప్లెక్స్‌లలో రెగ్యులర్‌ సీట్లకు రూ.150, రెక్లయినర్‌ సీట్‌కు రూ.250లుగా ధరలను ప్రభుత్వం నిర్ణయించింది.

ఇప్పటివరకు పాత జీవో ప్రకారం ఏపీలో సినిమా టికెట్ల ధరలు కొనసాగాయి. కొత్త జీవో ప్రకారం ఏపీలోని థియేటర్లలో గరిష్ఠంగా రూ.250, కనిష్ఠంగా రూ.20లకు టికెట్లు లభించనున్నాయి. థియేటర్లు ఉండే ప్రాంతాలను బట్టి మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు/గ్రామ పంచాయతీలుగా విభజించి టికెట్ల ధరలను నిర్ణయించారు. ఈ టికెట్ల ధరలకు జీఎస్టీ అదనంగా వసూలు చేస్తారు. అంతేకాదు, భారీ బడ్జెట్ సినిమాలు 10 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చారు.

Andhra Pradesh Govt Hike Cinema Tickets Price

ఇది రూ.100 కోట్లు, అంతకుమించి బడ్జెట్ తో తెరకెక్కే చిత్రాలకు వర్తిస్తుంది. అయితే ఏపీ సర్కారు ఇక్కడో షరతు విధించింది. ఏపీలో 20 శాతం చిత్రీకరణ జరుపుకున్న చిత్రాలకే ఈ టికెట్ రేట్ల పెంపు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ముఖ్యంగా చిన్న సినిమాలకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో చిన్న సినిమాలు ఐదో షో వేసుకోవచ్చని అనుమతి ఇచ్చింది.

మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో...

నాన్ ఏసీ థియేటర్లు- ప్రీమియం టికెట్ రూ.60, నాన్ ప్రీమియం టికెట్ రూ.40

ఏసీ/ఎయిర్ కూల్డ్ థియేటర్లు- ప్రీమియం టికెట్ రూ.100, నాన్ ప్రీమియం టికెట్ రూ.70.

స్పెషల్ థియేటర్లు- ప్రీమియం టికెట్ రూ.125, నాన్ ప్రీమియం టికెట్ రూ.100

మల్టీప్లెక్సులు- రెగ్యులర్ సీట్ టికెట్ రూ.150, రిక్లయినర్ సీట్ టికెట్ రూ.250

మున్సిపాలిటీల్లో...

నాన్ ఏసీ థియేటర్లు- ప్రీమియం టికెట్ ధర రూ.50, నాన్ ప్రీమియం టికెట్ ధర రూ.30

ఏసీ/ఎయిర్ కూల్డ్ థియేటర్లు- ప్రీమియం టికెట్ ధర రూ.80, నాన్ ప్రీమియం టికెట్ ధర రూ.60

స్పెషల్ థియేటర్లు- ప్రీమియం టికెట్ ధర రూ.100, నాన్ ప్రీమియం టికెట్ ధర రూ.80

మల్టీప్లెక్సులు- రెగ్యులర్ సీట్ టికెట్ ధర రూ.125, రిక్లయినర్ సీట్ టికెట్ ధర రూ.250

నగర పంచాయతీలు-గ్రామ పంచాయతీల్లో...

నాన్ ఏసీ థియేటర్లు- ప్రీమియం టికెట్ ధర రూ.40, నాన్ ప్రీమియం టికెట్ ధర రూ.20

ఏసీ/ఎయిర్ కూల్డ్ థియేటర్లు- ప్రీమియం టికెట్ ధర రూ.70, నాన్ ప్రీమియం టికెట్ ధర రూ.50

స్పెషల్ థియేటర్లు- ప్రీమియం టికెట్ ధర రూ.90, నాన్ ప్రీమియం టికెట్ ధర రూ.70

మల్టీప్లెక్సులు- రెగ్యులర్ సీట్ టికెట్ ధర రూ.100, రిక్లయినర్ సీట్ టికెట్ ధర రూ.250.

కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్‌, మార్చి 27 నుంచి కడప నుంచి అదనంగా మూడు విమాన సర్వీసులు, మూడు ఫిషింగ్‌ హార్భర్ల నిర్మాణం

దీనిపై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. తెలుగు సినిమా పరిశ్రమకు మేలు కలిగే విధంగా నిర్ణయం తీసుకున్నారని, థియేటర్ల మనుగడను, ప్రజలకు వినోదం అందుబాటులో ఉండాలన్న సంకల్పాన్ని దృష్టిలో ఉంచుకుని సినిమా టికెట్ల ధరలు సవరిస్తూ సరికొత్త జీవో జారీ చేశారని కొనియాడారు. అందుకు ఏపీ సీఎం జగన్ కు చిత్ర పరిశ్రమ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు చిరంజీవి వెల్లడించారు.

ముఖ్యంగా చిన్న సినిమాలకు ఐదవ షో వేసుకునే అవకాశం కల్పించడం ఎంతోమంది నిర్మాతలకు ఉపయోగపడే అంశం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానీకి, అధికారులకు, కమిటీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు చిరంజీవి తన ప్రకటనలో పేర్కొన్నారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement