Andhra Pradesh: 4.07 లక్షల మంది మహిళల ఖాతాల్లోకి రూ.46.9 కోట్లు, ఇళ్ల లబ్దిదారులకు వడ్డీ రీయింబర్స్‌మెంట్ విడుదల చేసిన సీఎం జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి 4.07 లక్షల మంది మహిళల ఖాతాల్లో రూ.46.9 కోట్లు బటన్ నొక్కి జమ చేశారు.

CM Jagan (Photo-APCMO/X)

Vjy, Jan 18: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి 4.07 లక్షల మంది మహిళల ఖాతాల్లో రూ.46.9 కోట్లు బటన్ నొక్కి జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. 12.77 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు పావలావడ్డీ రుణాలు ఇప్పించామని, ఈ దఫాలో 4.07 లక్షల మందికి వడ్డీ రియింబర్స్‌ కింద రూ.46.9 కోట్లు ఇవాళ విడుదల చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈకార్యక్రమం జరుగుతుంది. గతంలో సుమారు ఐదు లక్షలకు పైబడి అక్క చెల్లెమ్మలకు రూ.50 కోట్ల పైబడి ఇచ్చాం. రూ.35వేల రుణాలను పావలా వడ్డీకే ఇస్తున్నాం. దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా 31,19,000 ఇళ్ల స్థలాలు అక్క చెల్లెమ్మలకు ఇచ్చాం. అందులో ఇప్పటికే 22లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ఒక్కో ఇంటికి 2.7 లక్షలు ఖర్చు అవుతుంది. మౌలిక సదుపాయాలకు మరో రూ.1 లక్ష ఖర్చు అవుతోంది. ఇళ్ల నిర్మాణంకోసం ఉచితంగా ఇసుక ఇస్తున్నామని సీఎం పేర్కొన్నారు. 206 అడుగుల అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ, ప్రజలందరూ స్వచ్చందంగా తరలి రావాలని వీడియో ద్వారా కోరిన సీఎం వైఎస్ జగన్

‘‘సిమెంటు, స్టీల్‌, మెటల్‌ ఫ్రేంలు తదితర ఇంటి సామగ్రి మీద కనీసంగా రూ.40వేలు మంచి జరిగేలా చూస్తున్నాం. ఒక్కో ఇంటి స్థలం విలువ జిల్లాను బట్టి, ప్రాంతాన్ని బట్టి రూ.2.5లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ ఉంది. అన్ని కలుపుకుంటే దాదాపు ప్రతి అక్క చెల్లెమ్మకు రూ.5 -20 లక్షల వరకూ ఒక ఆస్తిని అక్కచెల్లెమ్మలకు ఇవ్వగలిగాం. ఈ అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కేవలం పావలా వడ్డీకే రూ.35వేల చొప్పున రుణాలు ఇప్పిస్తున్నాం. ఈ మంచి కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం’’ అని సీఎం జగన్‌ తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement