Andhra Pradesh Shocker: హైదరాబాద్‌లో ప్రేమ పుట్టింది, గుంటూరులోని రైల్వే పట్టాలపై విషాదంగా ముగిసింది, రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్యలో కీలక విషయాలు
ఓ ప్రేమజంట రైలుకింద పడి ఆత్మహత్య చేసుకుంది. మృతులను పెదకాకాని గ్రామానికి చెందిన దానబోయిన మహేశ్ (22), నందిగామ మండలం రుద్రవరానికి చెందిన నండ్రు శైలజ (21)లుగా గుర్తించారు.
Guntur, Oct 18: గుంటూరు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రేమజంట రైలుకింద పడి ఆత్మహత్య చేసుకుంది. మృతులను పెదకాకాని గ్రామానికి చెందిన దానబోయిన మహేశ్ (22), నందిగామ మండలం రుద్రవరానికి చెందిన నండ్రు శైలజ (21)లుగా గుర్తించారు.డిప్లొమా పూర్తిచేసిన మహేశ్ రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లోని ఓ మొబైల్ స్టోర్‌లో చేరాడు. ఆ సమయంలో అక్కడే పనిచేస్తున్న శైలజతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరి ప్రేమ విషయం తెలిసిన యువకుడి కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించారు.
యువతి కుటుంబ సభ్యులు మాత్రం పెళ్లికి నిరాకరించారు. దీంతో దసరా సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహేశ్, శైలజ ఆ తర్వాత కనిపించకుండా పోయారు. దీంతో శైలజ కుటుంబ సభ్యులు గాలించారు. ఈ క్రమంలో ఈ తెల్లవారుజామున పెదకాకాని సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఇద్దరూ విగత జీవులుగా కనిపించారు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.