AP Government Employees: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త, మే నెలకు పూర్తి జీతాలు, అధికారులను ఆదేశించిన ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు (AP Government Employees) జగన్ సర్కారు తీపి కబురును అందించింది. ప్రభుత్వ ఉద్యోగులకు మే నెలకు సంబంధించి పూర్తి జీతాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan Mohan Reddy) అధికారులను ఆదేశించారు. కరోనా కారణంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో కొంత శాతం జీతాలను ప్రభుత్వం వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే మే నెలకు ఇవ్వాల్సిన జీతాలపై గురువారం అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు.

AP CM YS Jagan | File Photo

Amaravati, May 22: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు (AP Government Employees) జగన్ సర్కారు తీపి కబురును అందించింది. ప్రభుత్వ ఉద్యోగులకు మే నెలకు సంబంధించి పూర్తి జీతాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan Mohan Reddy) అధికారులను ఆదేశించారు. కరోనా కారణంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో కొంత శాతం జీతాలను ప్రభుత్వం వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే మే నెలకు ఇవ్వాల్సిన జీతాలపై గురువారం అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో దుకాణాలు తెరుచుకోండి, ఉత్తర్వులు జారీ చేసిన పురపాలక శాఖ, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల గురించి ఓ సారి తెలుసుకోండి

ఈ నెలకు ఉద్యోగులకు పూర్తి స్థాయి జీతాలు (Get Ful Salary For may month) అందుతాయని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. పూర్తి జీతాలు చెల్లించేందుకు ముఖ్యమంత్రి జగన్ అంగీకరించారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ, ముఖ్యమంత్రి కార్యాలయంతో తాము సంప్రదించామని, గత రెండు నెలలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా జీతాలు 50 శాతం వాయిదా వేసినట్లు తెలిపారు. ఏపీలో మొత్తం 1680 మంది డిశ్చార్జ్, తాజాగా 45 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌, గ్రామాల్లో కోవిడ్ 19 నియంత్రణ చర్యలు చేపట్టాలని తెలిపిన కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ

ఈరోజు(మే21) నుంచి పూర్తిస్థాయి ఉద్యోగులు హాజరవుతున్నారని, ఉద్యోగులకు ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారని వెల్లడించారు. విధులకు హాజరయ్యే ఉద్యోగుల కోసం మాస్కులు, శానిటైజర్లను ఏర్పాటు చేశామని, హైదరాబాద్‌లో ఉన్నవారిని ప్రత్యేక బస్సుల్లో రప్పిస్తామని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Advertisement
Advertisement
Share Now
Advertisement