Amaravati, May 21:ఏపీలో కొత్తగా 45 మందికి కోవిడ్ 19 పాజిటివ్ కేసులు (AP Coronavirus) నమోదైనట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 2452కు (AP Corona Report) చేరింది. గడిచిన 24 గంటల్లో 8,092 మంది సాంపిల్స్ పరీక్షించగా 45 మందికి కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్థారణయింది. కాగా కొత్తగా 41 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో దుకాణాలు తెరుచుకోండి, ఉత్తర్వులు జారీ చేసిన పురపాలక శాఖ, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల గురించి ఓ సారి తెలుసుకోండి
దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1680కి చేరింది. కరోనాతో ఇవాళ నెల్లూరు నుంచి ఒకరు మరణించడంతో మృతుల సంఖ్య 54కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 718 కరోనా యాక్టివ్ కేసులు (Coronavirus Cases) ఉన్నాయి.
లాక్‌డౌన్‌కు (Lockdown) పరిమిత సడలింపులతో వలస కార్మికులు నగరాల నుంచి గ్రామాలకు వస్తున్న నేపథ్యంలో కోవిడ్ 19 వైరస్ వ్యాప్తి చెందకుండా మరిన్ని చర్యలు చేపట్టాలంటూ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సునీల్‌కుమార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాశారు.
AP Corona Report
#COVIDUpdates: రాష్ట్రం లోని నమోదైన మొత్తం 2452 పాజిటివ్ కేసు లకు గాను 1680 మంది డిశ్చార్జ్ కాగా, 54 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 718.#APFightsCorona #COVID19Pandemic
— ArogyaAndhra (@ArogyaAndhra) May 21, 2020
కేంద్ర పంచాయతీరాజ్ శాఖ రాష్ట్రాలకు చేసిన సూచనలు ఇవే
గ్రామాల్లో స్థానికులు కరోనా పేరుతో వలస కార్మికుల పట్ల వివక్షతో వ్యవహరించకుండా ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలి. అత్యంత మెరుగైన పారిశుద్ధ్య పరిస్థితులు నెలకొనేలా తగిన చర్యలు చేపట్టాలి. ఏఎన్‌ఎం, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తల సహకారంతో ఆయా గ్రామాల్లో కరోనా వైరస్ నియంత్రణ చర్యలు చేపట్టాలి. ప్రతి గ్రామంలోనూ గ్రామ వైద్య, పారిశుద్ధ్య అమలు కమిటీ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి. వైరస్ నివారణ కాల్షియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని ఫినాయిల్‌తో కలిపి గ్రామాల్లో విస్తృత స్థాయిలో పిచికారి చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టాల్సిన పనులతో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ రూపొందించిన చెక్ లిస్టును అమలు చేయాలి. మొత్తం 60 అంశాలలో గ్రామాల్లో కరోనా నియంత్రణ చర్యలు అమలు అవుతున్నాయా లేదా అని పరిశీలించాలి.