Corona in AP: ఆనందయ్య మందుపై హైకోర్టులో విచారణ వాయిదా, ఏపీలో తాజాగా 1,546 మందికి కరోనా పాజిటివ్‌, రాష్ట్రంలో ప్రస్తుతం 20,170 యాక్టివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌ లో గడిచిన 24 గంటల్లో ఏపీలో 69,606 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,546 మందికి కరోనా పాజిటివ్‌గా (New Covid-19 cases) నిర్థారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 18 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,428 కు చేరింది.

Coronavirus testing | File Image | (Photo Credits: PTI)

Amaravati, August 3: ఆంధ్రప్రదేశ్‌ లో గడిచిన 24 గంటల్లో ఏపీలో 69,606 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,546 మందికి కరోనా పాజిటివ్‌గా (New Covid-19 cases) నిర్థారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 18 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,428 కు చేరింది. కొత్తగా 1,940 మంది కోవిడ్‌ (Covid in AP) నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 19,37,956 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 20,170 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,71,554 కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు 2,47,78,146 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.

ఆనందయ్య తయారు చేసిన మందును కరోనా చికిత్సలో భాగంగా ఉపయోగించేందుకు రాష్ట్ర ఆయుష్‌ శాఖ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని ఆనందయ్య తరఫు న్యాయవాది ఎన్‌.అశ్వనీకుమార్‌ సోమవారం హైకోర్టుకు నివేదించారు. ఈ మందుకు పేరు ఖరారు చేయాల్సి ఉందన్నారు. ఆక్సిజన్‌ స్థాయిలు పెరిగేందుకు కరోనా రోగుల కంట్లో వేసే ఐ డ్రాప్స్‌కు ఆమోదం తెలిపే విషయంలో చర్చలు జరుగుతున్నాయని, ఇందులో కొంత పురోగతి ఉందని వివరించారు. విచారణను వాయిదా వేయాలని కోరారు. ఇందుకు అంగీకరించిన హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 24కి వాయిదా వేసింది.

ఏపీలో 4530 డిజిటల్‌ లైబ్రరీలు, ఆగస్టు 15న పనులు ప్రారంభించాలని అధికారులకు ఏపీ సీఎం ఆదేశాలు, కంప్యూటర్‌ పరికరాల కోసం దాదాపుగా రూ.140 కోట్లకు పైగా ఖర్చు చేయనున్న ఏపీ ప్రభుత్వం

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్య ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. తాను తయారు చేసిన మందుల పంపిణీకి అనుమతినిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ బొనిగె ఆనందయ్య హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఇదే అభ్యర్థనతో మరికొందరు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై సోమవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement