IPL Auction 2025 Live

Andhra Pradesh: నిన్న తన్నుకున్నారు..నేడు కలిసిపోయారు, వైసీపీ నాయకుడు సోమిశెట్టి సుబ్బారావు గుప్తాపై దాడి చేసిన బాలినేని అనుచరుడు సుభాని, బాలినేనికి నేనెప్పుడూ విధేయుడినే అంటూ గుప్తా వ్యాఖ్యలు

ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరుడు సుభానీ చేతిలో దాడికి (YSRCP cadres attack) గురైన వైసీపీ నాయకుడు సోమిశెట్టి సుబ్బారావు గుప్తా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది.

YSRCP cadres attack fellow worker (Photo-Vide Grab)

Amaravati, Dec 21: ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరుడు సుభానీ చేతిలో దాడికి (YSRCP cadres attack) గురైన వైసీపీ నాయకుడు సోమిశెట్టి సుబ్బారావు గుప్తా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది. ఒంగోలు పోలీస్ స్టేషన్ కు వెళ్లి తనపై దాడి జరిగిన అంశాన్ని వివరించిన సుబ్బారావు అక్కడి నుంచి నేరుగా విజయవాడకు వెళ్లారు. అక్కడ మంత్రి బాలినేనితో కలిసి సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడ కేక్ కట్ చేసిన బాలినేని.... గుప్తాకు ( Somisetty Subbarao Gupta) ఆ కేక్ తినిపించడంతో ఈ వివాదం సమసిపోయినట్లు తెలుస్తోంది. నేను బాలినేనికి ఎప్పుడూ విధేయుడినే పార్టీలో జరుగుతున్న పరిణామాలపై మాత్రమే వ్యాఖ్యలు చేశానని గుప్తా తెలిపారు.

కాగా ఈ నెల 12న ఒంగోలులో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న సుబ్బారావు.. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీల కారణంగా పార్టీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించి పార్టీలో కలకలం రేపారు. వారు అసలు వైసీపీకి హితులో, శత్రువులో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారి వల్ల పార్టీకి 20 శాతం ఓట్లు పోయే ప్రమాదం ఉందన్నారు. వారి కారణంగా పార్టీకి తీరని నష్టం జరిగే అవకాశం ఉందని, ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తే తమను కర్రలతో వెంబడించి కొడతారని అన్నారు.

హ్యాపీ బర్త్‌డే జగన్, ఏపీ సీఎం జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, వైఎస్ జగన్ జన్మదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్న వైసీపీ శ్రేణులు

ఆయన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బాలినేని అనుచరులు ఆగ్రహంతో ఊగిపోయారు. శనివారం అర్ధరాత్రి గుప్తా ఇంటిపై దాడిచేశారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేకపోవడంతో భార్యకు వార్నింగ్ ఇచ్చారు. ఇంటి బయట ఉన్న ఆయన ద్విచక్ర వాహనాన్ని తగలబెట్టారు. అనంతరం సుబ్బారావు గుప్తా గుంటూరులోని ఓ లాడ్జీలో ఉన్న విషయం తెలుసుకుని వాహనాల్లో నిన్న అక్కడికి వెళ్లిన బాలినేని అనుచరులు ఆయనపై దాడిచేశారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ చావబాదారు.

Here' Viral Video

తనను వదిలేయాలని సుబ్బారావు కాళ్లావేళ్లా పడి వేడుకున్నా వారు కనికరించలేదు ఎవరు చెబితే అలా మాట్లాడావంటూ సుభాని (YSRCP worker Subhani) ప్రశ్నించారు. తనకు ఎవరూ చెప్పలేదని, ఆ రోజు అలా అనుకోకుండా మాట్లాడేశానని, తనను వదిలేయాలని వేడుకున్నా వదిలిపెట్టలేదు. చివరికి మోకాళ్లపై కూర్చోబెట్టి క్షమాపణలు చెప్పించారు. ఈ మొత్తం ఘటనను వీడియో (record incident on mobile) తీశారు. నిన్న ఈ వీడియో సామాజిక మాధ్యమాలకెక్కి వైరల్ అయింది.

మరోపక్క, సుబ్బారావుపై దాడి ఘటనపై మంత్రి బాలినేని (Minister Balineni Srinivasa Reddy) మాట్లాడుతూ.. గుప్తాకు మతి స్థిమితం లేదన్నారు. గుప్తాపై దాడి జరుగుతున్న విషయం తెలిసి వద్దని తన వాళ్లను వారించానని చెప్పారు. గుప్తాకు అన్ని రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉన్నాయన్న మంత్రి.. గుప్తా వ్యాఖ్యల వెనక టీడీపీ నేత దామచర్ల జనార్దన్ వుండచ్చని అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు, గుప్తాపై దాడికి నిరసనగా ప్రకాశం జిల్లా పర్చూరు, కనిగిరిలలో ఆర్యవైశ్య సంఘం నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. గుప్తాపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుబ్బారావు ఇంటిపై దాడి, గుంటూరు లాడ్జిలో ఆయనపై జరిగిన దాడి సంఘటనలకు సంబంధించి ఒంగోలు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి.