MLC Challa Dies: ఎమ్మెల్సీ చల్లా భగీరథ్‌రెడ్డి కన్నుమూత, గత కొంతకాలంగా న్యుమోనియాతో బాధడుతున్న వైసీపీ నేత, చికిత్ర పొందుతూ తిరిగిరాని లోకాలకు..

గత కొంతకాలంగా న్యుమోనియాతో బాధపడుతున్న నంద్యాల జిల్లా అవుకుకు చెందిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ్‌రెడ్డి(46)కన్నుమూశారు. ఈ మధ్యనే అయ్యప్పమాల ధరించిన ఆయన.. శబరిమల వెళ్లొచ్చిన అనంతరం అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌ ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.

MLC Challa Bhagiratha Reddy (Photo-Twitter)

Vjy, Nov 3: గత కొంతకాలంగా న్యుమోనియాతో బాధపడుతున్న నంద్యాల జిల్లా అవుకుకు చెందిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ్‌రెడ్డి(46)కన్నుమూశారు. ఈ మధ్యనే అయ్యప్పమాల ధరించిన ఆయన.. శబరిమల వెళ్లొచ్చిన అనంతరం అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌ ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.

నాలుగు రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ్‌రెడ్డి అకాల మరణం పట్ల సీఎం వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అవుకులోని ఒక ప్రముఖ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన భగీరథ్‌రెడ్డి చురుకైన నాయకుడని సీఎం గుర్తు చేసుకున్నారు.

అయ్యన్నపాత్రుడు అరెస్ట్, ఆయనతో పాటు కొడుకు రాజేష్‌ను కూడా అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు, వారిద్దరినీ ఏలూరు కోర్టుకు తరలింపు

ఆయన కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెలిపారు. ఎమ్మెల్సీ చల్లా భగీరథ్‌రెడ్డి మృతిపట్ల గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. భగీరథ్‌రెడ్డి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని గవర్నర్‌ ఆకాంక్షించారని రాజ్‌భవన్‌ వర్గాలు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నాయి.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Advertisement
Advertisement
Share Now
Advertisement