Balineni Meet CM Jagan: బుజ్జగింపులు షురూ, సీఎం జగన్‌తో భేటీ అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి, గత కొంత కాలంగా అసంతృప్తితో ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే

మాజీ మంత్రి, ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిశారు. గత కొంతకాలంగా బాలినేని అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం నేపథ్యంలో ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో బాలినేనితో సీఎం జగన్ బుజ్జగింపు ధోరణితో మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది.

YSRCP MLA Balineni Srinivasa Reddy (Photo-Twitter)

VJY, May 2: మాజీ మంత్రి, ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిశారు. గత కొంతకాలంగా బాలినేని అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం నేపథ్యంలో ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో బాలినేనితో సీఎం జగన్ బుజ్జగింపు ధోరణితో మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది.

కాగా గత మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ సమయంలో బాలినేని తన మంత్రి పదవిని కోల్పోయారు. బాలినేని నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తగా వ్యవహరించారు. అయితే ఇటీవల ఆయన వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త పదవికి రాజీనామా చేశారు.పార్టీపై అలక కారణంగానే ఆయన ఈ పదవి నుంచి వైదొలిగారంటూ కథనాలు వచ్చాయి.

ఆ డబ్బు నాదైతే ఎంక్వయిరీ వేయించండి, వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి, రాజకీయ రంగు పులుముకున్న రూ. ఐదు కోట్ల వ్యవహారం

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తనకు ప్రాధాన్యత లభించడం లేదంటూ బాలినేని కొన్నాళ్లుగా అసంతృప్తితో ఉన్నట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల రాజీనామా తర్వాత తాడేపల్లి రావాలని పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చినా ఆయన స్పందించలేదని తెలిసింది. బాలినేని గత మూడ్రోజులుగా హైదరాబాద్ లోనే ఉన్నారు. కాగా, వ్యతిరేక వర్గాలను ప్రోత్సహిస్తున్నారంటూ బాలినేనిపై పార్టీ హైమాండ్ కు ఫిర్యాదులు వెళ్లాయి. బాలినేనిపై ఫిర్యాదు చేసినవారిలో పలువురు ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు ఉన్నట్టు తెలుస్తోంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement