YSRCP MLA Balineni Srinivasa Reddy (Photo-Twitter)

Amaravati, July 16: తమిళనాడు, ఆంధ్ర సరిహద్దులో కారులో పట్టుబడిన రూ. ఐదు కోట్ల వ్యవహారం ఏపీలో రాజకీయ రంగు పులుముకుంది. తమిళనాడు రిజిస్ట్రేషన్‌కు చెందిన ఆ కారుపై వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి (YSRCP MLA Balineni Srinivasa Reddy) స్టిక్కర్ ఉండటం అందులో పట్టుబడిన ముగ్గురు ఒంగోలు (Ongloe) వాసులు కావడంతో ఆ సొమ్ము ఆయనదేనన్న ప్రచారం జరుగుతోంది. కారులో మొత్తం ఐదుగురు వ్యక్తులు ఉండగా.. డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు దొరికిపోయారు కానీ.. అసలైన ఇద్దరు వ్యక్తులు తప్పించుకున్నారని చెబుతున్నారు. వారిలో ఓ బంగారం వ్యాపారి.. మరో రాజకీయ నాయకుడి కుమారుడు ఉన్నారని వార్తలు వస్తున్నాయి. మహిళలకు నాలుగు విడతల్లో రూ.75 వేలు, ఇందుకోసం నాలుగేళ్లలో రూ. 6163.59 కోట్లు కేటాయింపు, పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్

దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ, ఎమ్మెల్యే బాలినేని స్పందిస్తూ, ఓ వీడియోను (Video) విడుదల చేశారు. ఈ కారుకు, పార్టీకి సంబంధం లేదన్నారు. ఈ విషయం విచారణలో తెలుస్తుందని తెలిపారు. తనకు తెలిసినంత వరకూ కారుపై ఉన్న స్టిక్కర్ ఒరిజినల్ కాదని, జిరాక్స్ కాపీ అని వ్యాఖ్యానించారు.

Here's TN Police Seized Money Video 

ఆ వాహనం తమిళనాడులో రిజిస్టర్ అయిందని గుర్తు చేసిన ఆయన, స్టిక్కర్ ఫోటోస్టాట్ కాపీ అని, దీన్ని మీడియా వారు పరిశీలిస్తే, వారే గుర్తించగలరని అన్నారు. ఈ డబ్బు తనకు సంబంధించినది మాత్రం కాదని, అన్ని కోణాల్లోనూ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. తప్పు ఎవరిదైనా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Here's Balineni Srinivas Reddy Clarity Video

ఈ కేసుని చెన్నై ఐటీ శాఖ ముఖ్య కమీషనర్ అనిల్ కుమార్ దర్యాప్తు చేపట్టారు. ఆయనతో పాటు మరో ఇద్దరు అసిస్టెంట్ కమిషనర్లు రంగంలోకి దిగారు. కారు నంబర్, బాగుల్లోని నగదుపై సిరీస్ ఆధారంగా డబ్బు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుంది..? ఎలా వచ్చింది..? ఎవరిది..? అనే అంశాలను ఆరా తీస్తున్నారు. ఈ డబ్బు వ్యవహారంపై క్లారిటీ రావాల్సి ఉంది.