Andhra Pradesh Road Accident: కొత్త సంవత్సరం వేళ ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, బైక్‌ను ఢీకొట్టిన బొలెరో వాహనం, ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి

కొత్త సంవత్సరం ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Andhra Pradesh Road Accident) జరిగింది. బైక్‌, బొలెరో వాహనం ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందారు. ఈ ఘటన బేస్తవారపేట మండలం శెట్టిచెర్ల అడ్డరోడ్డు వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగింది.

Representative Image

కొత్త సంవత్సరం ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Andhra Pradesh Road Accident) జరిగింది. బైక్‌, బొలెరో వాహనం ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందారు. ఈ ఘటన బేస్తవారపేట మండలం శెట్టిచెర్ల అడ్డరోడ్డు వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బేస్తవారపేట పంచాయతీ పాపాయిపల్లికి చెందిన పవన్‌(20), శ్రీనివాస్‌(21), రాహుల్‌(21) టీ తాగేందుకు పందిళ్లపల్లి సమీపంలోని టోల్‌ప్లాజా వద్దకు ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు.

షాకింగ్ రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, బస్సును తప్పించబోయి అదుపుతప్పి బోల్తాపడిన సిమెంట్‌ లారీ

ఈ క్రమంలో గిద్దలూరు నుంచి బేస్తవారపేట వైపు వస్తున్న బొలెరో వాహనం వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో వాహనాల్లోని పెట్రోలు లీకై మంటలు చెలరేగాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై నరసింహారావు తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement