Andhra Pradesh Shocker: యువకుడితో బీచ్‌కు వెళ్లి గుట్టపై నుంచి పడిపోయిన యువతి, భయంతో ఆమెను వదిలేసి యువకుడు పరార్, రాత్రి నుంచి 12 గంటల పాటు నరకం చూసిన బాధితురాలు

విశాఖనగర శివారు అప్పికొండ సాగర తీరంలో ఓ యువతి రాళ్ల గుట్టల మధ్య చిక్కుకొని 12 గంటల పాటు నరక యాతన అనుభవించిన ఘటన సోమవారం చోటు చేసుకుంది.

Vizag Beach (Photo-Video Grab)

Vizag, Oct 10: విశాఖనగర శివారు అప్పికొండ సాగర తీరంలో ఓ యువతి రాళ్ల గుట్టల మధ్య చిక్కుకొని 12 గంటల పాటు నరక యాతన అనుభవించిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. దువ్వాడ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన ఓ యువతి (18) మరో యువకుడితో కలిసి ఈ నెల 2 నుంచి అప్పికొండ శివాలయ పరిసరాల్లో ఉంటున్నారు.

ఆదివారం సాయంత్రం ఆమె యువకుడితో కలిసి రాళ్ల గుట్టలపై ఫొటోలు తీసుకునేందుకు వెళ్లింది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ ఆమె ఎత్తు ప్రదేశం నుంచి జారి పడింది. దీంతో అపస్మారక స్థితిలోకి ఆమె వెళ్లిపోయింది. కంగారు పడిపోయిన యువకుడు ఆమెను అక్కడే వదిలేసి పారిపోయాడు. చుట్టూ చిమ్మచీకటి, జనసంచారం లేకపోవడంతో ఆమె రాత్రంతా నరకయాతన అనుభవిస్తూ మృత్యువుతో పోరాడింది.

గుజరాత్‌లో దారుణం, 8 ఏళ్ళ బాలికపై తండ్రి స్నేహితులు సామూహిక అత్యాచారం, తండ్రికి చెబుతుందనే భయంతో రాళ్లతో కొట్టి చంపిన కామాంధులు

సోమవారం బీచ్‌కు వచ్చిన కొందరు ఆమెను గుర్తించి గజఈతగాళ్ల సాయంతో ఆసుపత్రికి తరలించారు. యువతికాళ్లకు తీవ్రగాయాలైనట్టు తెలుస్తోంది. అయితే, తాను కాలుజారి పడిపోయానని, పరారీలో ఉన్న యువకుడిని ఏమీ అనొద్దని ఆమె చెప్పింది. మరోవైపు అంబులెన్స్ సిబ్బంది యువతి తల్లికి సమాచారం ఇవ్వడంతో ఆమె విశాఖకు బయలుదేరారు.

కుమార్తె కనబడకపోవడంతో అంతకుముందే తాము బందరు పోలీస్‌ స్టేషన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఆమె పేర్కొంది. కిడ్నాప్‌ కేసు నమోదు చేసినట్లు బందరు పీఎస్‌ నుంచి అంబులెన్స్‌ సిబ్బందికి సమాచారమిచ్చారు. కాగా, పరారీలో ఉన్న యువకుడికి కూడా ప్రమాదం జరిగిందని, అతను కూడా ఆసుపత్రిలో ఉన్నట్టు సమాచారం. దువ్వాడ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement