Andhra Pradesh Shocker: గుంటూరు జిల్లాలో దారుణం, ప్రేమించలేదని బ్లేడుతో యువతి గొంతు కోసి తన చేతిని కోసుకున్న ప్రేమోన్మాది, చికిత్స పొందుతూ యువతి మృతి
తన ప్రేమకు నో చెప్పిందని.. కోపంతో యువతి గొంతుకోసి (Jilted lover slits MBBS girl throat) చంపేశాడు ఓ ప్రేమోన్మాది.
Guntur, Dec 6: ఏపీలో గుంటూరు జిల్లాలో తక్కెళ్లపాడు గ్రామంలో దారుణ ఘటన (Andhra Pradesh Shocker) చోటు చేసుకుంది. తన ప్రేమకు నో చెప్పిందని.. కోపంతో యువతి గొంతుకోసి (Jilted lover slits MBBS girl throat) చంపేశాడు ఓ ప్రేమోన్మాది.పెదకాకాని సీఐ సురేష్‌బాబు కథనం ప్రకారం.. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన తపస్వి (21) విజయవాడ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (బీడీఎస్) తృతీయ సంవత్సరం చదువుతోంది.
అదే జిల్లా ఉంగుటూరు మండలం మానికొండకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జ్ఞానేశ్వర్‌తో రెండేళ్ల క్రితం ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయం ఏర్పడింది. కొంతకాలంగా జ్ఞానేశ్వర్ ప్రేమిస్తున్నానంటూ ఆ యువతిని వేధిస్తుండటంతో ఇటీవల విజయవాడ పోలీస్ స్టేషన్‌లో యువతి ఫిర్యాదు చేసింది. విజయవాడ పోలీసులు అతడిని స్టేషన్‌కు పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి.. మరోసారి ఇలా చేయవద్దని హెచ్చరించి పంపించారు.
సికింద్రాబాద్‌లో దారుణం.. కళ్లలో కారం కొట్టి, కత్తితో పొడిచి 14 తులాల బంగారు ఆభరణాల దోపిడీ!
అయినప్పటికీ జ్ఞానేశ్వర్ తన వేధింపుల్ని ఆపలేదు. ప్రేమించాలని ఒత్తిడి చేశాడు. అయితే ఆమె ప్రేమను తిరస్కరిస్తూ (rejecting marriage proposal) మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వార్నింగ్ ఇచ్చింది. దీంతో తపస్విని 10 రోజుల క్రితం తన స్నేహితురాలి రూమ్‌కు వెళ్లి అక్కడే ఉంటోంది. ఈ విషయం తెలుసుకున్న జ్ఞానేశ్వర్ సోమవారం రాత్రి సర్జికల్ బ్లేడు, కత్తి వెంట తీసుకుని తపస్వి ఉంటున్న ప్రాంతానికి చేరుకుని.. సర్జికల్ బ్లేడుతో ఆమె గొంతు కోశాడు. అనంతరం తన చేతిని కూడా కోసుకున్నాడు.
ఆమె స్నేహితురాలు కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని జ్ఞానేశ్వర్‌కు దేహశుద్ధి చేసి తాడుతో కట్టేసి పోలీసులకు సమాచారం అందించారు. తపస్విని చికిత్స నిమిత్తం మొదట ప్రైవేట్ ఆస్పత్రికి, ఆ తరువాత ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి తపస్వి (21) మరణించింది. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న జ్ఞానేశ్వర్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.