Andhra Pradesh Shocker: విశాఖలో దారుణం, మైనర్ బాలికపై ప్రియుడితో సహా 9 మంది దారుణంగా అత్యాచారం, ఎనిమిది మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
ఒడిషాకు చెందిన మైనర్ బాలిక తల్లిదండ్రులకు డిసెంబర్ 18న అందిన మిస్సింగ్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టారు.
విశాఖపట్నం, జనవరి 2: ఆంధ్రాలోని విశాఖపట్నంలో 16 ఏళ్ల మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఎనిమిది మందిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.డిసిపి శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిషాకు చెందిన మైనర్ బాలిక తల్లిదండ్రులకు డిసెంబర్ 18న అందిన మిస్సింగ్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టారు.
‘డిసెంబర్ 18న మైనర్ బాలిక తల్లిదండ్రులకు అందిన ఫిర్యాదు మేరకు అదే రోజు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాం. ఆమె ఒడిశాలో ఉన్నట్లు మాకు సమాచారం అందింది. వెంటనే మా పోలీసు బృందం అక్కడికి వెళ్లి ఆమెను డిసెంబర్‌లో తీసుకొచ్చారని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.
యూపీలో పరువు హత్య కలకలం, కూతురుని, ఆమె ప్రియుడిని గడ్డపారతో దారుణంగా పొడిచి చంపిన తండ్రి
విచారణలో బాధితురాలు తన ప్రియుడితో కలిసి హోటల్ గదికి వెళ్లినట్లు వెల్లడించినట్లు డీసీపీ తెలిపారు. ప్రియుడు ఆమెతో శారీరక సంబంధాలు పెట్టుకుని, ఆ తర్వాత తన స్నేహితుడిని హోటల్‌కు పిలిచాడు. అతడి స్నేహితుడు బాధితురాలిపై బలవంతంగా అత్యాచారం చేశాడు. ఆమె ప్రియుడు, అతని స్నేహితుడిచే అత్యాచారం చేసిన తరువాత బాధితురాలు RK బీచ్‌కు చేరుకుంది.
"బీచ్‌లో, ఆమె ఒక ఫోటోగ్రాఫర్‌ను కలుసుకుంది. అతడు ఆమెను ఓదార్చినట్లు నటించి, అతని స్నేహితుడి గదికి ఆమెను తీసుకువెళ్లాడు. అక్కడ, ఫోటోగ్రాఫర్‌తో పాటు మరో ఏడుగురు వ్యక్తులు మైనర్‌పై రెండు రోజుల పాటు అత్యాచారం చేశారు. ఆ తర్వాత అమ్మాయి వారి నుండి తప్పించుకుని పారిపోయిందని డీసీపీ తెలిపారు. మేము పోక్సో (లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ) చట్టం కింద కేసు నమోదు చేసాము. 8 మందిని అరెస్టు చేసాము. ఇతర నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి" అని ఆయన తెలిపారు. ఈ విషయంపై తదుపరి విచారణ కొనసాగుతోందని తెలిపారు.