Andhra Pradesh Shocker: వేరు కాపురం గొడవ, అత్తను, భార్యను దారుణంగా దారుణంగా కొట్టి చంపిన అల్లుడు, కర్నూలులో షాకింగ్ ఘటన

కర్నూలు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వేరు కాపురానికి భార్య ఒప్పుకోలేదని అత్తని, భార్యను ఓ అల్లుడు కిరాతకంగా కర్రతో కొట్టి చంపాడు.

Representative image. (Photo Credits: Unsplash)

Kurnool, June 12: కర్నూలు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వేరు కాపురానికి భార్య ఒప్పుకోలేదని అత్తని, భార్యను ఓ అల్లుడు కిరాతకంగా కర్రతో కొట్టి చంపాడు. కర్నూలు జిల్లాలోని కౌతాలం మండలం బాపురం గ్రామానికి చెందిన మహాదేవి(25) అనే వివాహితకు కర్ణాటక రాష్ట్రం టెక్కలికోటకు చెందిన బోయ రమేశ్‌తో నెల రోజుల క్రితం రెండో వివాహం జరిగింది. వివాహం జరిగిన తరువాత భర్త రమేశ్‌ టెక్కలికోటలోనే కాపురం పెడుదామని భార్య మహాదేవికి చెప్పాడు.

బాత్‌రూమ్‌లో స్నానం చేస్తూ భార్యభర్తలు మృతి, గీజర్ నుండి లీకైన కార్బన్ మోనాక్సైడ్ పొగ పీల్చడమే మరణానికి కారణమంటున్న పోలీసులు

ఇదే విషయంలో గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య తరుచూ వాగ్వాదం జరుగుతుంది. శనివారం అర్ధరాత్రి కూడా ఇద్దరు గొడవ పడ్డారు. దీంతో ఆవేశానికి లోనైన భర్త రమేశ్‌ భార్య మహాదేవిని , అత్త హనుమంతమ్మను కర్రతో దారుణంగా కొట్టి చంపాడు. స్థానికులు సమాచారం అందించడంతో హనుమంతమ్మ సోదరుడు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తల్లి, కూతుళ్ల మృతదేహాలను పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement