Tirupati Students Missing Case: తిరుపతి విద్యార్థుల మిస్సింగ్ కేసులో కీలక మలుపు.ఆగ్రాలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, ఏపీకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు

తిరుపతిలో మిస్సయిన పదో తరగతి విద్యార్థుల (Tirupati Students Missing Case) ఆచూకీ ఎట్టకేలకు లభించింది.మిస్ అయిన ఐదుగురు విద్యార్థులను ఆగ్రా సమీపంలో పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వారు యూపీ పోలీసుల అదుపులో ఉన్నారు.

school students including three girls go missing in Tirupati (Photo-ANI)

Tirupati, Nov 14: తిరుపతిలో మిస్సయిన పదో తరగతి విద్యార్థుల (Tirupati Students Missing Case) ఆచూకీ ఎట్టకేలకు లభించింది.మిస్ అయిన ఐదుగురు విద్యార్థులను ఆగ్రా సమీపంలో పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వారు యూపీ పోలీసుల అదుపులో ఉన్నారు. తిరుపతిలోని అన్నమయ్య స్కూల్ లో పదవ తరగతి చదువుతున్న ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు (Tirupati Scholl Students) ఈ నెల 9వ తేదీన అదృశ్యమయ్యారు. పిల్లల అదృశ్యంపై మిస్సింగ్ కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు తిరుపతి పడమర పోలీసులు. పిల్లలను తీసుకొచ్చేందుకు రెండు ప్రత్యేక పోలీసు బృందాలు ఆగ్రాకు చేరుకున్నాయి.

సీసీటీవీ పుటేజీలో ఇద్దరు అమ్మాయిల దృశ్యాలు, తిరుపతిలో మిస్సయిన అయిదుగురు విద్యార్థులు ఏమయ్యారు, రంగంలోకి దిగిన పోలీసులు

ఈ నెల 9వ తేదీ ఉదయం స్టడీ అవర్‌ అని చెప్పి స్కూల్ కి వెళ్లిన పిల్లలు తరువాత కనిపించకుండా పోయారు. విద్యార్థులు రైలు ఎక్కినట్లు సీసీ కెమెరా ఫుటేజ్‌లో కనిపించింది. దీంతో వెంటనే పోలీసులు అప్రమత్తం అయ్యారు. తాజ్ మహల్ చూడడానికి విద్యార్థులు ఆగ్రాకు వెళ్లారా? లేదా వేరే కారణం ఏదైనా ఉందా? అనేది తెలియాల్సి ఉంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement