AP Cabinet Meeting: మరికాసేపట్లో ఏపీ కేబినెట్ మీటింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ సహా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం

ఏపీ కేబినెట్ సమావేశం (Cabinet Meet) నేడు జరుగనుంది. సీఎం జగన్ (Cm YS Jagan) అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. వెలగపూడి సచివాలయంలోని ఫస్ట్ ఫ్లోర్ కేబినెట్ హాల్ లో ఈ సమావేశం జరుగనుంది. ఉదయం 11 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ (Cabinet Meet) ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది.

AP Cabinet Meeting- (Photo-AP CMO)

Vijayawada, SEP 20:   ఏపీ కేబినెట్ సమావేశం (Cabinet Meet) నేడు జరుగనుంది. సీఎం జగన్ (Cm YS Jagan) అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. వెలగపూడి సచివాలయంలోని ఫస్ట్ ఫ్లోర్ కేబినెట్ హాల్ లో ఈ సమావేశం జరుగనుంది. ఉదయం 11 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ (Cabinet Meet) ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల (Assembly Sessions) నిర్వహణపై కేబినెట్ చర్చించనుంది.గురువారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల పని దినాలపై కేబినెట్ లో చర్చించనున్నారు. గురువారం ఉదయం 9 గంటలకు శాసన సభ, ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశాలు మొదలవ్వనున్నాయి. ఐదు రోజులపాటు శాసన సభ సమావేశాలు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. అవసరాన్ని బట్టి సమావేశాలను మరో రెండు రోజులు పెంచే అవకాశం ఉంది.

Skill Development Scam Case: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై వాదనలు పూర్తి, తీర్పును రిజర్వ్‌లో ఉంచిన ఏపీ హైకోర్టు, ఏసీబీ కోర్టులో చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై విచారణ వాయిదా 

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లును ఈ సమావేశంలో ప్రవేశపెట్టున్నట్లు సమాచారం. ఇవే కాకుండా కొన్ని ఆర్డినెన్స్ లకు సంబంధించిన బిల్లులు, మరికొన్ని కొత్త బిల్లులను ప్రభుత్వం సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదనపై ఉద్యోగులు ఇటీవల భేటీలో కొన్ని మార్పులు కోరారు. సీఎం జగన్ నిర్ణయాన్ని బట్టి మంత్రివర్గం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మరోసారి భేటీ అయి వీటిని ఖరారు చేయాల్సివుంది.

Chandrababu Naidu Arrest: చంద్రబాబు అరెస్ట్ వెనకాల కేసీఆర్, మోడీ హస్తం, కుట్ర చేసి చంద్రబాబుకు బెయిల్ రాకుండా చేస్తున్నారని తెలిపిన మధుయాష్కీ 

అన్ని ఆర్డినెన్స్ లకు సంబంధించిన బిల్లులు, మరికొన్ని కొత్త బిల్లులను ఏపీ ప్రభుత్వం సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. బిల్లులతోపాటు కీలక అంశాలపై సభలో ప్రస్తావనకు వచ్చే ఛాన్స్ ఉంది. సీఎం జగన్ విశాఖకు తరలి వెళ్లే అంశంపై సభలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల వేదికగా చంద్రబాబుపై కేసులను ప్రస్తావించడానికి వైసీపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement