CM YS Jagan Review: కరోనాతో మరణించిన కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, వచ్చే నెల 30 నాటికి ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం జగన్‌ కీలక ఆదేశాలు, బొగ్గు కొరత రాకుండా చూడాలని కోరిన ఏపీ ముఖ్యమంత్రి

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan Review) సంచలన నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్‌తో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించాలని సీఎం ఆదేశించారు. వచ్చే నెల 30 నాటికి ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం జగన్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు.

CM YS jagan Review Meeting (Photo-Twitter)

Amaravati, Oct 18: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan Review) సంచలన నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్‌తో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించాలని సీఎం ఆదేశించారు. వచ్చే నెల 30 నాటికి ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం జగన్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు.

వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం జగన్‌ సోమవారం తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, కోవిడ్ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు హాజరయ్యారు. మెడికల్ కాలేజీల నిర్మాణం, విలేజ్ అర్బన్ హెల్త్ ఏర్పాటుపై సీఎం సమీక్షించారు. ప్రభుత్వాస్పత్రుల్లో సిబ్బంది నియామకం, కోవిడ్ వాక్సినేషన్ తదితర అంశాలపై చర్చించారు.

బొగ్గు సరఫరా, విద్యుత్‌ కొరత రాకుండా అమలు చేస్తున్న ప్రణాళికలు, దీర్ఘకాలిక వ్యూహాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని సీఎంకు అధికారులు తెలిపారు. మహానది కోల్‌ఫీల్డ్స్‌ నుంచి రెండు ర్యాకులు బొగ్గు అదనంగా వచ్చిందని అధికారులు వివరించారు. జెన్‌కో ఆధ్వర్యంలో థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తిని 50 మిలియన్‌ యూనిట్ల నుంచి 69 మిలియన్‌ యూనిట్లకు పెంచామని సీఎం జగన్‌కు అధికారులు తెలిపారు. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు కొరత లేకుండా చూసుకోవాలని సీఎం ఆదేశించారు. సింగరేణి సహా కోల్‌ ఇండియా సంస్థలతో సమన్వయం చేసుకోవాలని సీఎం సూచించారు.

చంద్రబాబుపై విరుచుకుపడిన మంత్రి కొడాలి నాని, డ్వాక్రా మహిళల డబ్బుకు ఎవరి రికమండేషన్‌ అవసరం లేదని తెలిపిన పేర్ని నాని, గొల్లపూడిలో వైఎస్సార్‌ ఆసరా కార్యక్రమం సంబరాలు

బొగ్గు తెప్పించుకునేందుకు సరుకు రవాణా షిప్పులను వినియోగించుకునే ప్రత్యామ్నాయాలపై కూడా ఆలోచనలు చేయాలని.. దీని వల్ల రవాణా ఖర్చులు కలిసి వస్తాయని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. దీని కోసం సంబంధిత కేంద్ర ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకోవాలన్నారు. పవర్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ నుంచి 170 మెగావాట్ల విద్యుత్‌కూడా అందుబాటులోకి వస్తోందని అధికారులు తెలిపారు.

కావాల్సిన విద్యుత్‌ను సమీకరించుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. తాత్కాలిక చర్యలతో పాటు దీర్ఘకాలిక విద్యుత్‌ ఉత్పత్తి వ్యూహాలపైనా దృష్టిసారించాలని సీఎం ఆదేశించారు. 6300 మెగావాట్ల రివర్స్‌ పంపింగ్‌ విద్యుత్‌ఉత్పత్తి ప్రాజెక్టు నిర్మాణంపై తగిన చర్యలు తీసుకోవాలని సీఎం తెలిపారు. సీలేరులో ప్రతిపాదిత 1350 మెగావాట్ల రివర్స్‌ పంపింగ్‌ ప్రాజెక్టుపైనా దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. ఈ ప్రాజెక్టులను సాకారం చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు

TDP Announced MLC Candidates: ఈ సారి వర్మకు నో ఛాన్స్, ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ, రేపటితో ముగియనున్న నామినేషన్ల గడువు

BRSLP Meeting Update: 11న బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం.. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన శాసనసభాపక్షం సమావేశం, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Advertisement
Advertisement
Share Now
Advertisement