YSR Asara: చంద్రబాబుపై విరుచుకుపడిన మంత్రి కొడాలి నాని, డ్వాక్రా మహిళల డబ్బుకు ఎవరి రికమండేషన్‌ అవసరం లేదని తెలిపిన పేర్ని నాని, గొల్లపూడిలో వైఎస్సార్‌ ఆసరా కార్యక్రమం సంబరాలు
YSRCP MLA Kodali Nani challenges Chandrababu On Ap capital Issue (Photo-Facebook)

Amaravati, Oct 17: ఆదివారం గొల్లపూడిలో నిర్వహించిన 'వైఎస్సార్‌ ఆసరా' కార్యక్రమం (YSR Asara Scheme) సంబరాలకు మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని (Ministers Kodali Nani, perni nani) ముఖ్యఅతిథులుగా వచ్చారు. ఈ సందర్బంగా మంత్రి కొడాలి నాని టీడీపీ పార్టీపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఒక పగటి వేషగాడు, పిట్టలదొర అంటూ మంత్రి తీవ్రస్థాయిలో ఫైర్‌ అయ్యారు. డ్వాక్రా సంఘాలను తనే ప్రవేశపెట్టానని చంద్రబాబు సొల్లు కబుర్లు చెబుతున్నాడు. 2014లో అధికారంలోకి రావడానికి డ్వాక్రా సంఘాలను అడ్డం పెట్టుకున్నాడు. డ్వాక్రా సంఘాలను మోసం చేసిన గజమోసగాడు. దేశ చరిత్రలో డ్వాక్రా సంఘాలను మోసం చేసిన వాడిగా చంద్రబాబు పేరు సువర్ణాక్షరాలతో లిఖించవచ్చు.

చంద్రబాబు ( Chandrababu) సారధ్యంలో కొందరు దొంగలు ఇప్పటికే పర్యటనలు మొదలు పెట్టారు. దేవినేని ఉమా సొల్లు కబుర్లు చెబుతుంటాడు. నేను, వంశీ ఫోన్లు చేసినా ఎత్తడు. మా ఫోన్లు బ్లాక్‌లో పెట్టేశాడు. దేవినేని ఉమా ఓ చవటదద్దమ్మ. ఉమా పకోడీ బెదురింపులకు అధికారులెవరూ భయపడొద్దు. మిమ్మల్ని ఇబ్బంది పెడితే కేసులు పెట్టండి. మీకు అండగా మేమున్నాం. చాలా మంది తెలుగుదేశం సన్నాసులకు ఓ విషయం తెలియదు. వైఎస్సార్‌సీపీ అంటే కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నారు. వైఎస్సార్‌సీపీ అంటే టీడీపీ కంటే బలమైన మాస్‌ ఇమేజ్‌ ఉన్న శక్తివంతమైన పార్టీ. గుడివాడైనా, మైలవరమైనా.. మరెక్కడైనా వైఎస్సార్‌సీపీ జెండానే ఎగురుతుంది' అని మంత్రి కొడాలి నాని అన్నారు.

విద్యుత్ కోతలపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు, ఏపీలో ఎటువంటి విద్యుత్‌ కోతలు ఉండవని తెలిపిన ప్రభుత్వం, బొగ్గు కొనుగోలుకు భారీగా నిధులు ఇచ్చిన జగన్ సర్కారు

డ్వాక్రా మహిళల డబ్బుకు ఎవరి రికమండేషన్‌ అవసరం లేదని రాష్ట్ర సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. ఆదివారం గొల్లపూడిలో ‘వైఎస్సార్‌ ఆసరా’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, డ్వాక్రా సంఘాలు కట్టే అప్పులు, వడ్డీలతోనే బ్యాంకులు నడుస్తున్నాయన్నారు. ‘‘మీ దగ్గర నుంచి వచ్చే వడ్డీలతో పెద్దొళ్లకు రూ.వేల కోట్ల లోన్‌లు ఇస్తారు. మన ఊర్లో కూడా ఓ ఎంపీకి రూ.7 వేల కోట్లు లోన్‌ ఇచ్చారు. అప్పులు తీరుస్తామన్న వ్యక్తి గెలిచిన తర్వాత మోసం చేశాడు. సీఎం జగన్‌ మాత్రం డ్వాక్రా సంఘాలకు అండగా నిలిచారు’’ అని మంత్రి పేర్ని నాని అన్నారు.

3,648 మందికి పట్టాలు ఇవ్వడం గొల్లపూడి చరిత్రలో మైలురాయి అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ అన్నారు. గత ప్రభుత్వం డ్రైనేజ్‌, తాగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్నారు. గత ప్రభుత్వంలో గొల్లపూడిలో రూ.200 కోట్ల అవినీతి జరిగిందని.. దీనిపై కలెక్టర్‌ విచారణ చేపట్టాలని రఘురాం అన్నారు.