IPL Auction 2025 Live

AP Global Investors Summit-2023: వాస్తవిక పెట్టుబడులు లక్ష్యంగా సదస్సు ముందుకు సాగాలి, గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌-2023 ఏర్పాట్లపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష

విశాఖపట్నంలో త్వరలో జరగనున్న జీ-20 వర్కింగ్‌ గ్రూపు సన్నాహక సమావేశం, గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌-2023 (AP Global Investors Summit-2023) ఏర్పాట్లపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan Mohan Reddy) తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.

CM-YS-jagan-Review-Meeting

VJY, Jan 12: విశాఖపట్నంలో త్వరలో జరగనున్న జీ-20 వర్కింగ్‌ గ్రూపు సన్నాహక సమావేశం, గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌-2023 (AP Global Investors Summit-2023) ఏర్పాట్లపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan Mohan Reddy) తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మార్చి 3–4 తేదీల్లో విశాఖలో జరగనున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు ఏర్పాట్లపై సీఎం సమీక్షించారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఈ సదస్సు జరగాలని అధికారులను ఆదేశించారు.

పవన్ కళ్యాణ్ పూర్తి స్పీచ్ ఇదే, యువతకు బంగారు భవిష్యత్‌ ఇచ్చేందుకు బాధ్యతగా పనిచేస్తానని హామీ, నేను సామాన్యుడిని అని తెలిపిన జనసేన అధినేత

2014–2019 మధ్య రూ. 18.87 లక్షల కోట్లకు ఎంఓయూలు చేసుకుంటే వాస్తవానికి ఆ మధ్యకాలంలో గ్రౌండ్‌ అయిన పెట్టుబడుల్లో ఏడాదికి సగటున రూ.11,994 కోట్లు పెట్టుబడులు వచ్చాయన్న అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. 2019–2022 మధ్య గ్రౌండ్‌ అయిన పెట్టుబడుల్లో సగటున ఏడాదికి పెట్టుబడులు రూ. 15,693 కోట్లు వచ్చాయని వెల్లడించారు.

ఏపీ ప్రభుత్వం తెచ్చిన జీవో నెం.1 ఈ నెల 23 వరకు సస్పెండ్ చేస్తూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, విచారణ ఈనెల 20కి వాయిదా వేసిన ధర్మాసనం

2019 నుంచి ఇప్పటివరకూ ఎస్‌ఐపీబీ ఆమోదించిన ప్రతిపాదనలు రూ.1,81,821 కోట్లు కాగా, ఈ పెట్టుబడులన్నీ వేర్వేరు దశల్లో పురోగతిలో ఉన్నాయని, వీటి ద్వారా 1,40,903 మందికి ఉద్యోగ కల్పన జరుగుతోందన్న అధికారులు సీఎంకు వివరించారు.

సీఎం జగన్ ఏమన్నారంటే..

►వాస్తవిక పెట్టుబడులు లక్ష్యంగా సదస్సు ముందుకు సాగాలన్న సీఎం.

►రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను సమగ్రంగా వివరించేలా కార్యక్రమం రూపొందించాలన్న సీఎం.

►కొత్త తరహా ఇంధనాల తయారీ సహా ప్రపంచ వ్యాప్తంగా కొత్త తరహా ఉత్పత్తుల తయారీకి ఏపీ వేదిక కావాలన్న సీఎం.

►దీనికి గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు ఊతం ఇవ్వాలన్న సీఎం.

►గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు సందర్భంగా వివిధ దేశాల్లో రోడ్‌షోలు నిర్వహిస్తామన్న అధికారులు.

►విదేశాలకు వెళ్తున్నప్పుడు అక్కడున్న పారిశ్రామిక వాడలను పరిశీలించాలన్న సీఎం. వాటి నిర్వహణపై అవగాహన పెంచుకోవాలన్న సీఎం.

►అలాగే ఆ దేశాల్లో ఎంఎస్‌ఎంఈలు నడుస్తున్న తీరుపై అధ్యయనం చేయాలన్న సీఎం.

►వాటి నిర్వహణా పద్ధతులను మన రాష్ట్రంలో అవలంభించడంపై దృష్టిపెట్టాలన్న సీఎం.

►ప్రపంచదేశాల నుంచి హాజరు కానున్న 250 మంది ప్రతినిధులు.

►ఒక్కొక్క జీ–20 సభ్యదేశం నుంచి 6గురు చొప్పున హాజరు.

►అంతర్జాతీయ సంస్థల నుంచి నలుగురు చొప్పున హాజరు.

►కేంద్ర ప్రభుత్వం నుంచి మరో 100 మంది ప్రతినిధులు హాజరు.

► మార్చి 28–29 మధ్య ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వర్కింగ్‌ గ్రూపు సమావేశం.

►సమావేశం కోసం విశాఖపట్నం నగరాన్ని అందంగా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశం.

►అవసరమైన రోడ్లు, సుందరీకరణ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలన్న సీఎం.

►ప్రధాన జంక్షన్లు, బీచ్‌ రోడ్డులో సుందరీకరణ పనులు చేపట్టాలన్న సీఎం.

►ఒక్క ఈ సమావేశం సందర్భంగానే కాదు, అన్ని రోజుల్లోనూ ఇవి ఇలాగే ఉండేలా తగిన కార్యాచరణ చేయాలన్న సీఎం.

►ఆతిథ్యం, రవాణా తదితర ఏర్పాట్లల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలన్న సీఎం.

►ఏర్పాట్లుకు సంబంధించి కమిటీలు ఏర్పాటు చేయాలన్న సీఎం.

►ఈ సమావేశానికి హాజరయ్యే ప్రతినిధులకు సౌలభ్యంగా ఉండేందుకు ఒక మొబైల్‌ యాప్‌ను రూపొందిస్తున్నట్టు తెలిపిన అధికారులు.

►ప్రతినిధులు పర్యాటక ప్రదేశాల సందర్శన సమయంలో ఎలాంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు బాగా ఉండేలా చూసుకోవాలన్న సీఎం.

►ఆయా పర్యాటక ప్రదేశాల వద్ద ఆహ్లాదకర పరిస్థితులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం.

►ప్రతినిధులకు భద్రత విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్న సీఎం.

►పెట్టబడులకు ఏపీలో ఉన్న అవకాశాలపై ప్రతినిధులను ఆకట్టుకునేలా కార్యక్రమాలు ఉండాలన్న సీఎం.



సంబంధిత వార్తలు