IPL Auction 2025 Live

Karakatta Illegal Issues: కరకట్ట అక్రమ నిర్మాణదారులకు మరోసారి నోటీసులు, విచారణలోపు కౌంటర్ దాఖలు చేయాలన్న హైకోర్టు, విచారణ ఆరువారాలకు వాయిదా

ఇందులో భాగంగా వారికి మరోసారి నోటీసులు జారీ చేస్తూ, పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పేర్కొంది. ఇప్పటికే హైకోర్టు నుంచి నోటీసులు అందుకున్న యజమానులు, ప్రభుత్వాధికారులు తదుపరి విచారణలోపు కౌంటర్ దాఖలు చేయాలనీ ఆదేశించింది.

ap-high-court-notices-again-karakatta-building-owners (Photo-Twitter)

Amaravathi, November 2: కష్ణానది ఒడ్డున వెలసిన అక్రమ నిర్మాణాల విషయంలో వివరణ ఇవ్వాలని ఆ నిర్మాణాల యజమానులను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. ఇందులో భాగంగా వారికి మరోసారి నోటీసులు జారీ చేస్తూ, పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పేర్కొంది. ఇప్పటికే హైకోర్టు నుంచి నోటీసులు అందుకున్న యజమానులు, ప్రభుత్వాధికారులు తదుపరి విచారణలోపు కౌంటర్ దాఖలు చేయాలనీ ఆదేశించింది. అనంతరం విచారణను ఆరు వారాలకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ఉత్తర్వుల ప్రకారం ఈ కేసులో ఇప్పటికే హైకోర్టు నుంచి నోటీసులు అందుకున్న యజమానులు, ప్రభుత్వాధికారులు తదుపరి విచారణకల్లా కౌంటర్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. కష్ణానది ఒడ్డున తాడేపల్లి మండలం, ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లోని వివిధ సర్వే నెంబర్లలో పలువురు ప్రముఖులు పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు చేపట్టారని, దీనిపై ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకష్ణారెడ్డి 2017లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో లింగమనేని రమేశ్, ఇతర నిర్మాణాల యజమానులు, పలువురు అధికారులతో సహా 49 మంది ప్రతివాదులుగా ఉన్నారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. నోటీసులు అందని వారికి మరోసారి నోటీసులు ఇవ్వాలని రిజిస్ట్రీని ఆదేశించింది.

ఇదిలా ఉంటే గతంలో నదీ తీరానికి వంద మీటర్ల లోపు ఉన్నవన్నీ అక్రమ కట్టడాలేనని, వరద నీటి మట్టానికి దిగువన ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఇలాంటి కట్టడాలను 58కి పైగా గుర్తించి వాటిపై సుదీర్ఘ కసరత్తు చేసింది. వీటిలో 28 అక్రమ కట్టడాలకు సీఆర్‌డీఏ అధికారులు నోటీసులు ఇచ్చారు.

గత నెలలో కృష్ణా కరకట్ట వాసులకు ఏపీ సీఎం జగన్ బంపరాఫర్ ప్రకటించారు. కరకట్టపైన, కరకట్ట లోపల ఉన్న పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు.కరకట్ట వెంబడి ఇళ్లు కోల్పోయిన పేదలకు వారు కోరిన చోట ఇళ్లు నిర్మించి ఇవ్వాలని జగన్ ఆదేశించారు. ఇప్పటి వరకు ఒకటిన్నర సెంట్ల స్థలంలో ఇళ్లు నిర్మించి ఇచ్చేవారు. కరకట్ట వాసులకు రెండు సెంట్ల స్థలంలో మంచి డిజైన్లతో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఉగాది నాటికి ఇళ్ల ప్రక్రియ పూర్తవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు వేసుకుని నివసిస్తున్న పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు.