Bus Tyres Out: ఇదేందయ్యా.. ఇది?? నడుస్తుండగానే ఊడిన ఏపీఎస్ఆర్టీసీ బస్సు చక్రాలు.. ఏలూరు వెళ్తున్న నరసాపురం డిపో బస్సు.. అజ్జమూరు వద్దకు రాగానే ఊడొచ్చిన బస్సు వెనక చక్రాలు.. భారీ శబ్దంతో ఓ వైపునకు ఒరిగిపోయిన బస్సు.. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు
నరసాపురం డిపోకు చెందిన ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఏలూరు వెళ్తుండగా దాని వెనుక చక్రాలు ఒక్కసారిగా ఊడి బయటకు వచ్చాయి. గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును ఆపేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు.
Vijayawada, October 11: ఏపీలో (AP) పెను ప్రమాదం తప్పింది. నరసాపురం (Narasapuram) డిపోకు చెందిన ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) బస్సు (Bus) ఏలూరు వెళ్తుండగా దాని వెనుక చక్రాలు (Backside Tyres) ఒక్కసారిగా ఊడి బయటకు వచ్చాయి. గమనించిన డ్రైవర్ (Driver) వెంటనే బస్సును ఆపేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బస్సు జాతీయ రహదారి మీదుగా ఏలూరు వెళ్తుండగా పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం అజ్జమూరు వద్ద బస్సు వెనక భాగంలో ఓ వైపున ఉన్న రెండు చక్రాలు ఊడి బయటకు వచ్చాయి. దీంతో భారీ శబ్దంతో బస్సు ఓ వైపునకు ఒరిగిపోయింది.
ఈ ఘటనతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. బస్సును ఆపేసిన డ్రైవర్ డిపో అధికారులకు సమాచారం అందించాడు. అనంతరం అందులోని ప్రయాణికులను వేరే బస్సుల్లో గమ్యస్థానాలకు పంపారు.
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Free Bus For SSC Students: టెన్త్ విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఉచిత బస్సు ప్రయాణం కావాలంటే ఏం చూపించాలంటే?
Tesla Rent for Mumbai Showroom: ముంబైలో నెలకు రూ. 35 లక్షలకు పైగా అద్దెతో టెస్లా తొలి షోరూమ్ ఏర్పాటు, ఇంకా ఐదు సంవత్సరాల పాటు సంవత్సరానికి 5 శాతం అద్దె పెంపు..
Free Bus In AP: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. అయితే జిల్లాల పరిధిలోనే ఫ్రీ బస్సు.. జిల్లా దాటితే ఛార్జీల మోతే.. కీలక ప్రకటన చేసిన మంత్రి సంధ్యారాణి
Advertisement
Advertisement
Advertisement