Monkeypox: విజయవాడలో మంకీపాక్స్ కలకలం, దుబాయ్ నుంచి వచ్చిన కుటుంబంలో మంకీపాక్స్ లక్షణాలు, బెంబేలెత్తిన బెజవాడవాసులు, పరీక్షల్లో మంకీపాక్స్ కాదని తేలడంతో ఊపిరి పీల్చుకున్న విజయవాడ ప్రజలు

విజయవాడ వాసులకు బిగ్ రిలీఫ్ లభించింది. దుబాయ్ నుంచి వచ్చిన వారికి మంకీపాక్స్ (monkey pox) లేదని పుణె వైరాలజీ ల్యాబ్ తేల్చింది. దుబాయ్(Dubai) నుంచి వచ్చిన ఆ కుటుంబానికి ఇతర కాంటాక్టులు నమోదు కాలేదని ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రజలెవరూ ఆందోళనకు గురికావొద్దని సూచించింది. ప్రస్తుతం విజయవాడ ఆసుపత్రిలో (Vijayawada hospital) చిన్నారికి చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు.

Monkeypox (Pic Credit: Twitter)

Vijayawada, July 18:  విజయవాడ వాసులకు బిగ్ రిలీఫ్ లభించింది. దుబాయ్ నుంచి వచ్చిన వారికి మంకీపాక్స్ (monkey pox) లేదని పుణె వైరాలజీ ల్యాబ్ తేల్చింది. దుబాయ్(Dubai) నుంచి వచ్చిన ఆ కుటుంబానికి ఇతర కాంటాక్టులు నమోదు కాలేదని ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రజలెవరూ ఆందోళనకు గురికావొద్దని సూచించింది. ప్రస్తుతం విజయవాడ ఆసుపత్రిలో (Vijayawada hospital) చిన్నారికి చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. అది మంకీపాక్స్ కాదని డాక్టర్లు నిర్ధారించడంతో టెన్షన్ తొలగింది. బెజవాడ వాసులు రిలాక్స్ అయ్యారు. దుబాయ్ నుంచి ఇటీవల విజయవాడ వచ్చిన ఓ కుటుంబంలోని రెండేళ్ల చిన్నారికి మంకీపాక్స్ ను (monkey pox)పోలిన లక్షణాలు కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. బాలికకు మంకీపాక్స్ అయ్యుంటుందన్న అనుమానంతో నమూనాలు సేకరించి, వాటిని పుణెలోని వైరాలజీ ల్యాబ్ కు పంపారు. అయితే ఆ చిన్నారికి మంకీపాక్స్ నెగెటివ్ గా( monkey pox negative) వచ్చింది. ఆ బాలికకు మంకీపాక్స్ కాదని డాక్టర్లు నిర్ధారించారు. ఆ బాలికకు చర్మంపై మామూలు దద్దుర్లు వచ్చినట్టు గుర్తించారు. బాలిక కుటుంబం ఇతరులతో కాంటాక్ట్ కాలేదని ఆరోగ్యశాఖ కమిషనర్ వెల్లడించారు.

YSRCP Support For Dhankar: ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ ధన్‌కర్‌కు మద్దతు పలికిన వైఎస్సార్సీపీ, ట్విట్టర్ ద్వారా ధన్‌కర్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ విజయసాయి రెడ్డి..   

మంకీపాక్స్.. యావత్ ప్రపంచాన్ని భయపెడుతున్న ఈ వైరల్ వ్యాధి భారత్ నూ వణికిస్తోంది. దేశంలో కేసులు పెరిగే ప్రమాదముందని కేంద్రం అలర్ట్ అయ్యింది. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లోనూ మంకీపాక్స్ కలకలం రేపింది. విజయవాడలోకి మంకీపాక్స్ ఎంటరైనట్టు వచ్చిన వార్తలు అలజడి రేపాయి. దీంతో ఒక్కసారిగా ప్రజల్లో ఆందోళన మొదలైంది. అయితే, అది మంకీపాక్స్ కాదని డాక్టర్లు తేల్చడంతో అంతా రిలాక్స్ అయ్యారు.

Hyderabad Shocker: ఔటర్ రింగు రోడ్డుపై కాల్పుల కలకలం, లారీ డ్రైవర్ పై కాల్పులు జరిపిన దుండగులు, ఉలిక్కి పడ్డ పోలీసులు, విచారణ ప్రారంభం.. 

సాధారణంగా ఈ మంకీపాక్స్ అనేది స్మాల్ పాక్స్(small pox) కుటుంబానికి చెందిన వైరల్‌ వ్యాధి అని నిపుణులు అంటున్నారు. ఈ వ్యాధి జంతువుల నుంచి మానవులకు సోకుతుందని.. ముఖ్యంగా ఎలుకలు, చుంచులు, ఉడతలు వంటి జీవుల కారణంగా ఈ వ్యాధి వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాగా.. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా జరిపిన పరిశోధనల్లో కొన్ని ప్రాంతాల్లో మంకీపాక్స్‌ అధికంగా వ్యాప్తి చెందడానికి శృంగారమే ప్రధాన కారణమని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. స్మాల్ పాక్స్ లాంటి లక్షణాలే ఉన్నా ఇది చాలా ప్రమాదకరం అంటున్నారు వైద్య నిపుణులు. ఎందుకంటే మంకీపాక్స్ కు గురైన వ్యక్తి.. జ్వరం, తలనొప్పి, వాపు, నడుము నొప్పి, కండరాల నొప్పి, నీరసం వంటి లక్షణాలతో ఉంటారు. ముఖం, చేతులు, కాళ్లపై దద్దుర్లు, బొబ్బలు ఏర్పడి.. రోగి తీవ్ర ఇబ్బందులు పడతారని ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ వ్యాధి సోకిన వారిలో చాలా మంది కోలుకుంటారు. కొందరికి మాత్రమే ఈ వ్యాధి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందంటున్నారు.

మనుషుల నుంచి మనుషులకు సోకే అవకాశం కూడా ఉంది అంటున్నారు. ముఖ్యంగా తుంపర్ల ద్వారా, లేదా వ్యాధి సోకిన వ్యక్తికి అతి దగ్గరం ఉండటం వల్ల ఇది ఇతరులకు వ్యాపించే అవకాశముంది. అయితే శరీరంలోకి పూర్తిగా వ్యాప్తి చెందడానికి సాధారణంగా 6 నుంచి 13 రోజులు పడుతుంది. ఒక్కోసారి 5 నుంచి 21 రోజుల సమయం కూడా పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ వైరస్‌ను 1958లో మొదటిసారిగా కోతుల్లో గుర్తించారు. అందుకే మంకీపాక్స్ అని పేరుపెట్టారు. ఆ తర్వాత 1970ల్లో తొలిసారి మనుషుల్లో ఇది బయటపడింది. సాధారణంగా ఎలుకలు, చుంచు, ఉడతల నుంచి ఈ వ్యాధి అధికంగా వ్యాపిస్తున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Martyr's Day 2025, Mahatma Gandhi Death Anniversary Quotes: నేడు మహాత్మ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన సూక్తులను ఫోటో గ్రీటింగ్స్ రూపంలో షేర్ చేయండిలా..

Martyrs' Day 2025, Mahatma Gandhi Punyatithi, Shaheed Diwas Quotes: మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మీ స్నేహితులకు, బంధుమిత్రులకు మహాత్మ గాంధీ కొటేషన్స్ షేర్ చేసి నివాళి అర్పించండి..

Peddireddy Ramachandra Reddy: 25ఏళ్లుగా మేము భూమిని సాగు చేస్తున్నాం, అటవీ భూమి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు, వారిపై పరువు నష్టం దావా వేస్తానని తెలిపిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Uttar Pradesh: వీడియో ఇదిగో, గుండెపోటుతో ఆస్పత్రికి మహిళ వస్తే వైద్యం చేయకుండా రీల్స్‌ చూస్తూ కూర్చున్న డాక్టర్, కళ్లముందే విలవిలలాడుతూ బాధితురాలు మృతి

Share Now