Bomb Blast in Kadapa: కడపలో ఘోర ప్రమాదం, 9 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు, జిలిటెన్ స్టిక్స్ అన్‌లోడ్ చేస్తుండగా భారీ స్థాయిలో పేలుడు
ఆంధ్రప్రదేశ్‌లో కడప జిల్లా కలసపాడు మండలంలో ఘోర ప్రమాదం (Bomb Blast in Kadapa) చోటు చేసుకుంది. మామిళ్లపల్లె శివారులో ఉన్న గనిలో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
Kadapa, May 8: ఆంధ్రప్రదేశ్‌లో కడప జిల్లా కలసపాడు మండలంలో ఘోర ప్రమాదం (Bomb Blast in Kadapa) చోటు చేసుకుంది. మామిళ్లపల్లె శివారులో ఉన్న గనిలో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ముగ్గురాయి తొలగించేందుకు జిలిటెన్ స్టిక్స్ పేలుస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని వార్తలు వస్తున్నాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బద్వేలు నుంచి ముగ్గురాళ్లగనికి జిలెటిన్‌స్టిక్స్ తరలిస్తుండగా ఘటన చోటు చేసుకుందని మరికొన్ని వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇక గుంటూరులో రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం కొర్రపాడు దగ్గర అదుపు తప్పి బైక్ బోల్తా పడింది. ప్రమాదంలో మాచవరం తహసీల్దార్ ఆఫీసు సీనియర్ అసిస్టెంట్ బాజి మృతి చెందారు. మాచవరం నుంచి గుంటూరు వెళుతుండగా ఘటన చోటు చేసుకుంది.