Skill Development Scam: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం రూపకర్త చంద్రబాబే! ఏపీలో జైలుకెళ్తున్న తొలిమాజీ సీఎం చంద్రబాబే అంటూ సెటైర్లు వేసిన సజ్జల రామకృష్ణారెడ్డి
స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం, స్కాం రూపకర్త మొత్తం చంద్రబాబే కారణమని ఆరోపించారు.
Vijayawada, SEP 10: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandra Babu) అరెస్టు, రిమాండ్‌పై ఏపీ ప్రభుత్వ సలహదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి ( Sajjala Ramakrishna Reddy ) తో పాటు పలువురు ఏపీ మంత్రులు స్పందించారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం, స్కాం రూపకర్త మొత్తం చంద్రబాబే కారణమని ఆరోపించారు. ఆదివారం రాత్రి 7 గంటలకు విజయవాడ ఏసీబీ కోర్టు చంద్రబాబును రిమాండ్ ( Remand ) విధించడమై ఆయన మాట్లాడారు. ఏపీలో జైలుకెళ్తున్న తొలి మాజీ సీఎం చంద్రబాబు అని ఘాటుగా విమర్శించారు.
ఈ స్కామ్‌లో చంద్రబాబు పాత్రపై ఆధారాలున్నాయని వెల్లడించారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం ( Skill Development ) లో భారీగా అవినీతి జరిగిందని అన్నారు. 40 ఏళ్లుగా చంద్రబాబు ఎన్నో స్కామ్‌లు చేశారని విమర్శించారు. చంద్రబాబు అరెస్టు తరువాత సొంతపుత్రుడి కంటే పవన్ కల్యాణ్ హడావిడి ఎక్కువైందని ఆరోపించారు. రాత్రి పవన్ కల్యాణ్ ఓవర్ యాక్షన్ చేశారని విమర్శించారు.
మరోవైపు మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి ఢిల్లీ నుంచి తెచ్చుకున్న న్యాయవాది ఏఏజీ ముందు దిగదుడుపే అయ్యిందని పేర్కొన్నారు. మరోవైపు చంద్రబాబు రిమాండ్ తీర్పును స్వాగతించిన మంత్రి రోజా సంబరాలు నిర్వహించారు. పటాకులు కాలుస్తూ మిఠాయిలు పంచిపెట్టారు. ఆమె మాట్లాడుతూ చంద్రబాబు ఎంతో మంది జీవితాలను నాశనం చేశారని అన్నారు. ఎంతో మందిని ఆయన క్యారెక్టర్ లేని వాళ్లుగా చిత్రీకరించారని మండిపడ్డారు.