YS Jagan Road show: భారీ వ‌ర్షాన్ని సైతం లెక్క చేయ‌కుండా సీఎం జ‌గ‌న్ స‌భ‌కు పోటెత్తిన జ‌నం, చంద్ర‌బాబుకు ఓటేస్తే కొండ‌చిలువ నోట్లో త‌ల‌పెట్టిన‌ట్లేనన్న జ‌గ‌న్

పలమనేరు బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, మరో 9 రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరగబోతుందన్నారు. ‘‘పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే.. కొండచిలువ నోట్లో తలపెట్టినట్లే. చంద్రబాబును నమ్మితే మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది.

jagan

Palamaner, May 04: ‘‘ఈ ఎన్నికలు.. ఐదేళ్ల భవిష్యత్‌.. జగన్‌కు ఓటేస్తే.. పథకాలు కొనసాగింపు.. పొరపాటున బాబుకు ఓటేస్తే.. పథకాలు ముగింపేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శనివారం మధ్యాహ్నం పలమనేరు బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, మరో 9 రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరగబోతుందన్నారు. ‘‘పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే.. కొండచిలువ నోట్లో తలపెట్టినట్లే. చంద్రబాబును నమ్మితే మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది. 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. రూ.2 లక్షల 70వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశాం. లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమం అందించాం.

 

59 నెలల్లోనే 2 లక్షల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చాం. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చాం. పిల్లల చదువులు కోసం అమ్మఒడితో ప్రోత్సహిస్తున్నాం. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియం తీసుకొచ్చాం. మహిళల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌గా భావించాం’’ అని సీఎం జగన్‌ చెప్పారు.

 

‘‘రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?. పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తానన్నాడు.. చేశాడా?. ఆడబిడ్డ పుడితే రూ.25 వేలు డిపాజిట్‌ చేస్తానన్నాడు.. చేశాడా?. ఇంటికో ఉద్యోగం అన్నాడు.. ఇచ్చాడా?. ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు.. ఇచ్చాడా?. అర్హులకు 3 సెంట్ల స్థలం ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?. రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌ అన్నాడు.. చేశాడా?. ఉమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేస్తానన్నాడు.. చేశాడా?. సింగపూర్‌ను మించి అభివృద్ధి చేస్తానన్నాడు.. చేశాడా?. ప్రతి నగరంలో హైటెక్‌ సిటీ నిర్మిస్తానన్నాడు.. నిర్మించాడా?. చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చడా?. మళ్లీ ఈ మోసగాళ్లు సూపర్‌ సిక్స్‌, సెవెన్‌ అంటున్నారు. కేజీ బంగారం, బెంజ్‌కారు ఇస్తాననంటారు.. నమ్ముతారా?’’ అంటూ చంద్రబాబు మోసాలను సీఎం జగన్‌ ఎండగట్టారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Telangana Assembly Sessions: 12 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 18న లేదా 19న రాష్ట్ర బడ్జెట్, ఈసారైనా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వచ్చేనా!

Teegala Krishna Reddy: మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇంట విషాదం.. రోడ్డు ప్రమాదంలో దుర్మరణంపాలైన తీగల మనవడు కనిష్క్ రెడ్డి

Advertisement
Advertisement
Share Now
Advertisement