Cyclone Mandous: దక్షిణ కోస్తాంధ్రకు భారీ వర్షాలు, రేపు మహాబలిపురంలో తీరం దాటనున్న మాండూస్ తుపాను, ప్రస్తుతం తమిళనాడుకు వైపుకు దూసుకు వస్తున్న సైక్లోన్

బుధవారం రాత్రి ట్రింకోమలీ (శ్రీలంక)కి 410 కిలోమీటర్లు, జాఫ్నాకు (శ్రీలంక) 550 కిలోమీటర్లు, కారైకాల్‌కు 610 కిలోమీటర్లు, చెన్నైకి 700 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది.

Cyclone (Photo Credits: Wikimedia Commons)

VJY, Dec8: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నేడు తుపానుగా మారనుంది. ప్రస్తుతం ఇది గంటకు 10 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా శ్రీలంక, తమిళనాడు వైపు దూసుకు వస్తోంది. బుధవారం రాత్రి ట్రింకోమలీ (శ్రీలంక)కి 410 కిలోమీటర్లు, జాఫ్నాకు (శ్రీలంక) 550 కిలోమీటర్లు, కారైకాల్‌కు 610 కిలోమీటర్లు, చెన్నైకి 700 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది.

ఈ తుపానుకు యూఏఈ సూచించిన మాండూస్‌ (Cyclone Mandous) అని నామకరణం చేశారు.ఈ తుఫాను 9వ తేదీ రాత్రి తమిళనాడులోని మహాబలిపురం సమీపంలో తీరం దాటుతుందని చెబుతున్నారు. తీరాన్ని దాటే సమయంలో గంటకు 65–75 కి.మీలు, గరిష్టంగా 85 కి.మీల వేగంతో ఈదురుగాలులు (heavy rains & thunderstorms) వీస్తాయని పేర్కొంది. తీరం దాటిన తర్వాత వాయుగుండంగా బలహీనపడి చిత్తూరు వైపు కదులుతుందని చెబుతున్నారు. గురువారం నుంచి 10వ తేదీ వరకు తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది.

చిత్తూరు తీరం వైపు తుపాను, రానున్న మూడు రోజుల పాటు కోస్తాంధ్రకు భారీ వర్షాలు, ఈ రోజు సాయంత్రం మాండూస్‌ తుపానుగా బలపడనున్న వాయుగుండం

తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగాలను రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. సముద్రం అలజడిగా ఉంటుందని, దక్షిణకోస్తా – తమిళనాడు తీరాల వెంబడి శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్‌ అంబేద్కర్‌ తెలిపారు. వేటకు వెళ్ళిన మత్స్యకారులు వెంటనే వెనక్కి తిరిగి రావాలని కోరారు.

షాకింగ్ వీడియోలు, వారికి నిజంగానే జాంబీ వైరస్‌ సోకిందా, ఫిలడెల్ఫియాలో రోడ్లపై చిత్ర విచిత్రంగా నడుస్తున్న వీడియోలు వైరల్, డ్రగ్స్ తీసుకున్న వారు అయి ఉండొచ్చన్న అభిప్రాయాలు

మాండూస్‌ ప్రభావంతో 8వ తేదీ నుంచి 3 రోజులపాటు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ, తమిళనాడులో (Tamil Nadu, Andhra Pradesh) వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్‌ జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. 10, 11 తేదీల్లో ఏపీలో వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉందని తెలిపింది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now