Delhi Liquor Scam: 50 ఏళ్లుగా మద్యం వ్యాపారంలో ఉన్నాం, మా బంధువులకు మాగుంట పేరు ఉంటే మాపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి

ఎంపీ మాగుంట మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌తో (Delhi Excise Policy Scam) మాకెలాంటి సంబంధం లేదు. 50 ఏళ్లుగా మేము మద్యం వ్యాపారం చేస్తున్నాము.

YSRCP MP Magunta Sreenivasulu Reddy (Photo-Twitter)

Ongloe, Sep 19: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి విదితమే.ఢిల్లీతో పాటుగా తెలుగు రాష్ట్రాల్లో సైతం ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో తమ కుటుంబంపై వస్తున్న తప్పుడు ఆరోపణలపై ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి (YSRCP MP Magunta Sreenivasulu Reddy) స్పందించారు. తాజాగా ఎంపీ మాగుంట మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌తో (Delhi Excise Policy Scam) మాకెలాంటి సంబంధం లేదు. 50 ఏళ్లుగా మేము మద్యం వ్యాపారం చేస్తున్నాము.

దేశంలోనే నంబర్ వన్‌గా ఏపీ, కోవిడ్‌ ప్రభావం ఉన్నా ఏపీకి భారీగా పెట్టుబడులు, 11.43% గ్రోత్‌రేట్‌తో ఇతర రాష్ట్రాల కన్నా రాష్ట్రం మెరుగైన స్థితిలో ఉందని తెలిపిన సీఎం జగన్

ఢిల్లీ లిక్కర్‌ వ్యాపారంలో మా కుమారుడికి ఒక్క శాతం వాటా కూడా లేదు. లిక్కర్‌ స్కామ్‌లో మాపై కుట్రపూరితంగా మాట్లాడుతున్నారు. ఢిల్లీ లిక్కర్‌ బిజినెస్‌లో నేను, నా కొడుకు డైరెక్టర్లుగా లేము. ఢిల్లీలో 32 జోన్లు ఉంటే.. మా బంధువులకు రెండో జోన్లలో షాపులు ఉన్నాయి. మా బంధువులకు మాగుంట పేరు ఉండటంతో మాపై ఆరోపణలు చేస్తున్నారు. ఈడీ అధికారుల అనుమానం నివృత్తి చేశాము అని కామెంట్స్‌ చేశారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Advertisement
Advertisement
Share Now
Advertisement