Road Accident: కర్ణాటకలో ఆగివున్న లారీని ఢీకొట్టిన జీపు.. ఐదుగురు ఏపీవాసుల దుర్మరణం.. మరో 13 మందికి గాయాలు.. కలబురిగిలో దర్గా ఉర్సుకు వెళ్లి వస్తుండగా ఘటన
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీలోని నంద్యాల జిల్లా వెలుగోడుకు చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. అదుపు తప్పిన జీపు రోడ్డు పక్కన ఆగివున్న లారీని బలంగా ఢీకొట్టింది.
Bengaluru, June 6: కర్ణాటకలో (Karnataka) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీలోని (AP) నంద్యాల (Nandyala) జిల్లా వెలుగోడుకు చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. అదుపు తప్పిన జీపు (Jeep) రోడ్డు పక్కన ఆగివున్న లారీని బలంగా ఢీకొట్టింది. బాధితులు కలబురిగిలోని దర్గా ఉర్సుకు వెళ్లి వస్తుండగా యాదగిరి జిల్లాలో దుర్ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద విషయం తెలిసి వెలుగోడులో విషాద ఛాయలు అలముకున్నాయి.
బాధితులు వీళ్లే
- మునీర్ (40)
- నయామత్ (40)
- రమీజా బేగం (50)
- ముద్దత్ షీర్ (12)
- సుమ్మి (13)
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Bengaluru Shocker: పోర్న్‌కు బానిసైన ఇంజనీర్, మహిళల లోదుస్తులు దొంగిలించి వాటితో కోరికలు తీర్చుకుంటుండగా అరెస్ట్ చేసిన పోలీసులు
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Advertisement
Advertisement
Advertisement