IPL Auction 2025 Live

Kollu Ravindra Arrested: కొల్లు రవీంద్ర మరోసారి అరెస్ట్, మచిలీపట్నం చింతచెట్టు సెంటర్‌లో ఆక్రమణల తొలగింపు విషయంలో మున్సిపల్‌ అధికారులతో వాగ్వాదం

మచిలీపట్నం చింతచెట్టు సెంటర్‌లో ఆక్రమణల తొలగింపును మున్సిపల్‌ అధికారులను చేపట్టారు. అయితే రవీంద్ర (Former minister and TDP leader Kollu Ravindra) కల్పించుకుని మున్సిపల్‌ అధికారులతో వాగ్వాదానికి దిగారు.

Kollu Ravindra (Photo-Twitter)

Amaravati, July 10: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు (Kollu Ravindra Arrested) చేశారు. మచిలీపట్నం చింతచెట్టు సెంటర్‌లో ఆక్రమణల తొలగింపును మున్సిపల్‌ అధికారులను చేపట్టారు.

అయితే రవీంద్ర (Former minister and TDP leader Kollu Ravindra) కల్పించుకుని మున్సిపల్‌ అధికారులతో వాగ్వాదానికి దిగారు. అంతే కాకుండా వారు ఎంత చెప్పినా వినలేదు. దీంతో పోలీసులు వచ్చి రవీంద్రను అక్కడి నుంచి వెళ్లి పోవాలని సూచించారు. అయినప్పటికీ వినకపోవడంతో పోలీసులు రవీంద్రను అరెస్టు చేశారు. ఈ ఏడాది మార్చి నెలలో విధి నిర్వహణలో ఉన్న ఎస్‌ఐపై చేయి చేసుకున్న కారణంగా కొల్లు రవీంద్రను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

ఇక నిబంధనలను ఉల్లంఘించి ప్రెస్‌మీట్‌ పేరిట సభ నిర్వహించేందుకు యత్నించిన టీడీపీ నాయకులను తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి పోలీసులు శుక్రవారం అడ్డుకున్నారు. విశాఖ జిల్లా నాతవరం మండలం, సుందరకోట శివారు బమిడికలొద్దులో చేపట్టిన బాక్సైట్‌ తవ్వకాలు నిలిపివేయాలంటూ మాజీ మంత్రులు చినరాజప్ప, అయ్యన్నపాత్రుడు తదితరులు గిరిజన ప్రాంతాలైన జల్దాం, చల్లూరు, దబ్బాదిలో పర్యటించారు. తర్వాత వీరు రౌతులపూడి చేరుకున్నారు. ప్రెస్‌మీట్‌ పేరుతో సభ నిర్వహించేందుకు ప్రయత్నించారు.

వైసీపీ నేత హత్య కేసు, టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్, ఇప్పటికే ఈ కేసులో అయిదుమందిని అరెస్ట్ చేసిన పోలీసులు

కోవిడ్‌ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వీరిని పోలీసులు అడ్డుకున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం వరకు టీడీపీ నేతలతో పోలీసులు చర్చించినా వినలేదు. దీంతో చినరాజప్ప, అయ్యన్నపాత్రుడు, నక్కా ఆనందబాబు, ప్రత్తిపాడు టీడీపీ ఇన్‌చార్జ్‌ వరుపుల రాజా, ఎమ్మెల్సీ సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, వంగలపూడి అనిత, వంతల రాజేశ్వరి, బి.రామానాయడు, శ్రావణ్‌కుమార్, కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌కుమార్, తదితరులను పోలీసులు అరెస్టు చేసి కోటనందూరు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసిన అనంతరం విడుదల చేశారు