Rape Attempt: ఏకాంతంగా ఊసులడుకుంటున్న ప్రేమ జంట దగ్గరికి గంజాయి బ్యాచ్.. యువకుడిని తాళ్లతో కట్టి యువతిపై గ్యాంగ్ రేప్ యత్నం.. భయపడిపోయి గట్టిగా కేకలు వేసిన యువతి.. తర్వాత ఏమైందంటే? కృష్ణా జిల్లాలో దారుణ ఘటన..

కృష్ణా జిల్లాలో గంజాయి బ్యాచ్ దారుణం.. యువకుడిని బంధించి యువతిపై అత్యాచార యత్నం.. ప్రేమ జంటను ఆటోలో వెంబడించిన గంజాయి ముఠా.. యువకుడిని తాళ్లతో కట్టి యువతిపై అఘాయిత్య యత్నం.. యువతి కేకలతో ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు.. నిందితుల ఆటోలో గంజాయి

Rape Attempt (Representational: Getty)

Vijayawada, October 22: కృష్ణా జిల్లాలో (Krishna District) ఓ గంజాయి బ్యాచ్ (Ganja Batch) చెలరేగిపోయింది. ఓ ప్రేమ జంట ఏకాంతంగా గడపడం చూసిన నిందితులు యువకుడిని బంధించి యువతిపై అత్యాచారానికి యత్నించారు. గన్నవరం మండలం (Gannavaram) ముస్తాబాద్‌లో (Musthabad) జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. ఓ ప్రేమ జంట నిర్మానుష్య ప్రదేశం వైపు వెళ్తుండడాన్ని గమనించిన నిందితులు ఆటోలో వారిని వెంబడించారు. అనంతరం యువకుడిని పట్టుకుని తాళ్లతో బంధించారు. ఆపై యువతిపై అత్యాచారానికి యత్నించారు.  యువతి గట్టిగా కేకలు వేయడంతో స్పందించిన స్థానికులు అక్కడికి చేరుకున్నారు. గమనించిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికులు వెంబడించి వారిలో ఒకరిని పట్టుకున్నారు.

బంగాళాఖాతంలో తుపాను... సోమవారం విరుచుకుపడే ప్రమాదం.. అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వ యంత్రాంగం.. ఏపీపై తుపాను ప్రభావం స్వల్పమేనన్న విపత్తుల నిర్వహణ శాఖ.. అయినప్పటికీ అధికారులను సిద్ధం చేస్తున్న వైనం.. హెల్ప్ లైన్ నెంబర్లు ప్రకటన..

అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. నిందితుల ఆటోను స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో గంజాయి ఉండడాన్ని గమనించారు. దీంతో వారు గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రేమ జంటను ఆసుపత్రికి తరలించారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Tesla Rent for Mumbai Showroom: ముంబైలో నెలకు రూ. 35 లక్షలకు పైగా అద్దెతో టెస్లా తొలి షోరూమ్‌ ఏర్పాటు, ఇంకా ఐదు సంవత్సరాల పాటు సంవత్సరానికి 5 శాతం అద్దె పెంపు..

Posani Krishna Murali: గుంటూరు జైలుకు పోసాని కృష్ణ మురళి, 10 రోజుల రిమాండ్ విధించిన నరసరావుపేట 13వ అదనపు జిల్లా కోర్టు

Uttar Pradesh: ఇంత దారుణమా, నడిరోడ్డు మీద వృద్ధ దంపతులను ఇష్టం వచ్చినట్లుగా తన్నుతూ కొట్టిన ఓ వ్యక్తి, ఆపకుండా చోద్యం చూసిన స్థానికులు

Bride Father Died: కుమార్తె పెళ్లి జరుగుతుండగా గుండెపోటుతో తండ్రి మృతి.. పెండ్లి ఆగిపోవద్దన్న ఉద్దేశంతో తండ్రి మరణవార్త చెప్పకుండానే కొండంత దుఃఖంతోనే వివాహ క్రతువును పూర్తి చేయించిన బంధువులు.. కామారెడ్డిలో విషాద ఘటన

Advertisement
Advertisement
Share Now
Advertisement