IPL Auction 2025 Live

Gidugu Rudraraju: ఏపీ కాంగ్రెస్ పార్టీ కొత్త బాస్‌గా గిడుగు రుద్రరాజు, 18 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏర్పాటు చేసిన అధిష్టానం, సోషల్ మీడియా కమిటీ చైర్మన్‌గా తులసిరెడ్డి

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మల్లికార్జున ఖర్గే పార్టీలో ప్రక్షాళన మొదలుపెట్టారు. అందులో భాగంగా ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న శైలజానాథ్‌ను తప్పించి ఆయన స్థానంలో గిడుగు రుద్రరాజును నియమించారు.

Gidugu-Rudra-Raju (Photo-Twitter/Rudrarajugidugu)

Amaravati, Nov 24: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి కొత్త చీఫ్ వచ్చేశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మల్లికార్జున ఖర్గే పార్టీలో ప్రక్షాళన మొదలుపెట్టారు. అందులో భాగంగా ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న శైలజానాథ్‌ను తప్పించి ఆయన స్థానంలో గిడుగు రుద్రరాజును నియమించారు. అలాగే, 18 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీతోపాటు 34 మందితో కో ఆర్డినేషన్ కమిటీని అధిష్ఠానం నియమించింది. సీనియర్ నేత హర్షకుమార్‌కు కూడా పదవి లభించింది.

మస్తాన్ వలీ, జంగా గౌతమ్, సుంకర పద్మశ్రీ, పి.రాజేశ్‌లను కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమించిన అధిష్ఠానం.. హర్షకుమార్‌ను క్యాంపెయిన్ కమిటీ చైర్మన్‌గా నియమించింది. మరో సీనియర్ నేత తులసిరెడ్డి మీడియా, సోషల్ మీడియా కమిటీ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రుద్రరాజుకు సౌమ్యుడిగా, వివాద రహితుడిగా పేరుంది.

చంద్రబాబులా దుష్టచతుష్టయాన్ని నేను నమ్ముకోలేదు. నేను దేవుడిని, ప్రజలను నమ్ముకున్నా, రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీలో సీఎం జగన్

కాంగ్రెస్‌తో చిన్నప్పటి నుంచే అనుబంధం ఉన్న ఆయన పార్టీకి అత్యంత విధేయుడు కూడా. తనను ఏపీసీసీ చీఫ్‌గా నియమించడంపై రుద్రరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తానన్నారు. అందరినీ కలుపుకుని ముందుకెళ్తానని పేర్కొన్నారు.



సంబంధిత వార్తలు

SC Dismisses Plea for Ballot Paper: పేప‌ర్ బ్యాలెట్‌తో ఎన్నిక‌లు నిర్వాహించాలనే పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు, విచారణలో కీలక వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం

AP CM Chandrababu: గత ఐదేళ్లలో వ్యవస్థలన్నీ విధ్వంసానికి గురయ్యాయి..జీవోలను రహస్యంగా ఉంచారని సీఎం చంద్రబాబు మండిపాటు, అధికారాన్ని దుర్వినియోగం చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే అని కామెంట్

Deputy CM Pawan Kalyan: కేంద్రమంత్రి షెకావత్‌తో డిప్యూటీ సీఎం పవన్ భేటీ, టూరిజం హబ్‌గా ఏపీ..కేంద్రం సాయంతో పలు పర్యాటక ప్రాజెక్టులు రాబోతున్నాయని వెల్లడించిన పవన్ కళ్యాణ్

Rains in AP: బంగాళాఖాతంలో వాయుగుండం.. నేటి నుంచి ఏపీలో భారీ వర్షాలు.. ఈ నెల 29 వరకు వానలే వానలు.. దక్షిణ కోస్తాలో ఈదురుగాలులు