Accident In Guntur: గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. వ్యవసాయ కూలీలతో వెళుతున్న ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ముగ్గురు మహిళల మృతి (వీడియో)

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళా వ్యవసాయ కూలీలు మృతి చెందగా, మరి కొందరు గాయపడ్డారు.

Accident in Guntur (Credits: X)

Guntur, Feb 17: గుంటూరు (Guntur) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళా వ్యవసాయ కూలీలు మృతి చెందగా, మరి కొందరు గాయపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. చెబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన మహిళా వ్యవసాయ కూలీలు (Farmers) ఆటోలో మిర్చి కోతల నిమిత్తం నీరుకొండ గ్రామానికి వెళ్తుండగా, వీరు ప్రయాణిస్తున్న ఆటోను నారా కోడూరు – బుడంపాడు గ్రామాల మధ్య ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్‌కి తరలించారు.

తెలంగాణ అప్పులపై నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్ ఘాటు కౌంటర్, రాష్ట్రం ఎప్పటికీ మిగులు రాష్ట్రమే అంటూ లేఖ

మృతుల వివరాలు ఇవి..

మృతులను అరుణకుమారి, నాంచారమ్మ, సీతారావమ్మగా గుర్తించారు. దట్టమైన పొగమంచు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 13 మంది కూలీలు ఉన్నట్లు గుర్తించారు.

ఢిల్లీని వణికించిన భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.0గా గుర్తింపు.. ఊగిపోయిన భవనాలు.. మళ్లీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ అలర్ట్ (వీడియో)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement