Hindupur Gang Rape Case: హిందూపురం గ్యాంగ్ రేప్ సీసీ పుటేజీ ఇదిగో, ఆరుగురు కామాంధులు అత్తా కోడళ్లను షెడ్డులోకి లాక్కెళ్లి అత్యాచారం, నిందితుల్లో ముగ్గురు మైనర్లు

శ్రీసత్యసాయి జిల్లాలో అర్ధరాత్రి అత్తాకోడళ్లపై గ్యాంగ్ రేప్ జరిగిన సంగతి విదితమే. చిలమత్తూరు మండలం నల్లబొమ్మనిపల్లిలో వాచ్‌మెన్‌, అతని కొడుకును కత్తులతో బెదిరించి అత్తాకోడళ్లపై ఐదుగురు గుర్తు తెలియని దుండగులు అత్యాచారం చేశారు.

Police step up investigation into 'gang-rape' incident in Hindupur Here's CCTV footage

Hindupur, Oct 14: శ్రీసత్యసాయి జిల్లాలో అర్ధరాత్రి అత్తాకోడళ్లపై గ్యాంగ్ రేప్ జరిగిన సంగతి విదితమే. చిలమత్తూరు మండలం నల్లబొమ్మనిపల్లిలో వాచ్‌మెన్‌, అతని కొడుకును కత్తులతో బెదిరించి అత్తాకోడళ్లపై ఐదుగురు గుర్తు తెలియని దుండగులు అత్యాచారం చేశారు.ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆరుగురు నిందితుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. స్థానిక సీసీ ఫుటేజ్‌ ద్వారా ఆధారాలు సేకరించారు. మొత్తం ఆరుగురు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. త్వరగా కేసును ఛేదిస్తామని చెప్పారు.

మరోవైపు బాధితురాలిద్దరికీ హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రి(Hindupuram Government Hospital)లో చికిత్స పొందుతున్నారు. దీంతో మంత్రి సవిత(Minister Savita) హిందూపురం ఆస్పత్రికి వెళ్లారు. అత్యాచారానికి గురైన అత్తాకోడళ్లను పరామర్శించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు(CM Chandrababu) చాలా సీరియస్‌గా ఉన్నారని చెప్పారు. అత్యాచారానికి పాల్పడిన ఆరుగురు నిందితులను కఠినంగా శిక్షిస్తామని మంత్రి సవిత పేర్కొన్నారు.

బాధితులు ఉపాధి కోసం ఇటీవలే బళ్లారి నుంచి వచ్చినట్లు గుర్తించారు. వీళ్లంతా స్థానికంగా ఉండే ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్లు తెలిపారు. కుటుంబం ఒంటరిగా ఉండటాన్ని గతకొన్ని రోజులుగా గమనించిన వాళ్లే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

తండ్రీ కొడుకుల‌ను కత్తులతో బెదిరించి.. అత్తాకోడ‌ళ్ళ‌పై సామూహిక లైంగిక దాడి.. శ్రీ‌స‌త్య‌సాయి జిల్లాలో దారుణం

కర్ణాటకలోని బళ్లారికి చెందిన వ్యక్తి ఐదు నెలల క్రితం చిలమత్తూరు మండలంలో పొలాల వద్ద నిర్మాణంలో ఉన్న పేపర్‌ మిల్లులో వాచ్‌మన్‌గా చేరాడు. ఆ పక్కనే ఉన్న రేకుల షెడ్డులో ఆయనతో పాటు భార్య, కుమారుడు, కోడలు నివసిస్తున్నారు. శుక్రవారం రాత్రి 2 గంటల సమయంలో మూడు ద్విచక్రవాహనాలపై ఆరుగురు దుండగులు ఆ భవనం వద్దకు వచ్చి వాచ్‌మన్‌ను తాగడానికి నీరు అడిగారు. తొట్డెలో ఉన్నాయని చెప్పడంతో వాచ్‌మన్‌ కుటుంబం నివసిస్తున్న రేకుల షెడ్డువైపు వెళ్లారు. సీసీ కెమేరాలున్నాయని వాచ్‌మన్‌ చెప్పడంతో దుండగులు వాటిని ధ్వంసం చేశారు. ఆ అలికిడికి వాచ్‌మెన్‌ భార్య, కుమారుడు, కోడలు బయటికి వచ్చారు.

Hindupur Gang Rape Case CCTV footage

దుండగులు ఆ ఇద్దరు మహిళలపై అఘాయిత్యానికి ప్రయత్నించగా వాచ్‌మన్‌, అతని కుమారుడు ప్రతిఘటించారు. దీంతో వారిపై దాడి చేశారు. అక్కడున్న కత్తి తీసుకుని బెదిరించడంతో తండ్రీకొడుకు నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. దుండగులు ఆ ఇద్దరినీ బయటికి గెంటేసి, అత్తాకోడలిని రెండు వేర్వేరు రేకుల షెడ్లలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఏడాదిన్నర వయసున్న చిన్నారి బోరున విలపిస్తున్నా పట్టించుకోలేదు. గంటన్నరపాటు అక్కడే ఉన్న దుండగులు తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. వాచ్‌మన్‌ కుమారుడు సమీపంలోని గ్రామానికి వెళ్లి ఆ గ్రామస్థుల ఫోన్‌ ద్వారా పరిశ్రమ యజమానికి జరిగిన ఘోరం గురించి చెప్పగా, ఆయన పోలీసులకు తెలియజేశారు. జిల్లా ఎస్పీ రత్న శనివారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకుని ఆరాతీశారు. బాధిత మహిళలను ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

అత్యాచారం జరిగిన 24 గంటల్లోనే పోలీసులు కేసును ఛేదించారు. దుండగులను పట్టుకునేందుకు ఎస్పీ నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రానికే నిందితుల్లో ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. నిందితుల్లో ముగ్గురు పాత నేరస్థులు, వారిలో ఒకరు అంతర్రాష్ట్ర మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌గా పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. నిందితుల్లో ముగ్గురు మైనర్లు కూడా ఉన్నట్లు సమాచారం. వీరు చోరీ చేసేందుకు వెళ్లి తిరిగి వచ్చే సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు విచారణలో ఒప్పుకొన్నట్టు తెలిసింది.

ఘటనను ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకుంది. సీఎం చంద్రబాబు జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు. బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందేలా చూడాలని, నిందితులను వెంటనే పట్టుకుని, కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, వారిలో భరోసా నింపాలని ఎస్పీని ఆదేశించారు. హోంమంత్రి అనిత కూడా జిల్లా ఎస్పీతో మాట్లాడి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ బాధితులను ఫోన్‌లో పరామర్శించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని భరోసా ఇచ్చారు.

హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న అత్యాచార బాధిత మహిళలను బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖల మంత్రి సవిత, హిందూపురం ఎంపీ బీకే పార్థసారధి ఆదివారం పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Andhra Pradesh: సూపర్‌ సిక్స్‌ అమలుపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు, ఆర్థిక పరిస్థితి మెరుగు పడ్డాకే పథకాలు అమలు చేస్తామని వెల్లడి, ప్రజలు అర్థం చేసుకోవాలని సూచన

Amit Shah Takes Holy Dip at Triveni Sangam: వీడియోలు ఇవిగో, త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన హోమంత్రి అమిత్ షా, మహాకుంభమేళాలో ఘాట్‌ వద్ద ప్రత్యేక పూజలు

SC Dismisses Jagan's Bail Cancellation Petition: జగన్‌ బెయిల్‌ రద్దుకు కారణాలేవీ లేవు, రఘురామ పిటిషన్ డిస్మిస్‌ చేస్తున్నట్లు ఆదేశాలిచ్చిన సుప్రీంకోర్టు, ఈ కేసును కేసును తెలంగాణ హైకోర్టు విచారిస్తోందని వెల్లడి

Vijayasai Reddy: జగన్‌ ప్రజాదరణ ఏమాత్రం తగ్గదు..ఆయనకు నమ్మకద్రోహం చేయను అన్న విజయసాయి రెడ్డి, బీజేపీ నుండి గవర్నర్ పదవి హామీ తీసుకోలేదని స్పష్టం

Share Now