Representative Image (Photo Credit: Pixabay)

Vijayawada, Oct 12: ఏపీలోని (AP) శ్రీ‌స‌త్య‌సాయి జిల్లా చిలమత్తూరు మండలం నల్లబొమ్మనిపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు వివాహితులపై గ్యాంగ్ రేప్ (Gang Rape) జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు, పోలీసుల  వివరాల ప్రకారం.. ఐదు నెలల క్రితం బళ్ళారి నుంచి వ‌చ్చిన ఓ కుటుంబం  గ్రామంలో నివాసం ఉంటుంది. కుటుంబ పెద్దతో పాటు అతని కొడుకు పేపర్ మిల్లు లో వాచ్ మెన్లుగా  ప‌నిచేస్తున్నారు. భార్య, కోడలు ఇండ్లల్లో పనులు చేసేవారు.

బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారనున్న ఉపరితల ఆవర్తనం, రానున్న మూడు రోజుల పాటు తెలంగాణకు వర్ష సూచన, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

Here's Update:

కాళరాత్రిగా మారిన..

శుక్రవారం అర్ధరాత్రి రెండు బైక్‌ ల‌పై వ‌చ్చిన ఐదుగులు దుండ‌గులు సదరు తండ్రీ, కొడుకుల‌ను కత్తులతో బెదిరించి, అత్తాకోడ‌ళ్ళ‌ను పక్కకు లాక్కెళ్ళి వారిపై లైంగిక దాడికి తెగబడ్డారు. అనంతరం పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఏపీకి పొంచిఉన్న వాయుగుండం ముప్పు.. సోమవారం నుంచి భారీ వర్షాలకు అవకాశం.. వాతావరణ శాఖ హెచ్చరికలు