Jagananna Vasathi Deevena 2021: తల్లుల ఖాతాల్లోకి జగనన్న వసతి దీవెన నగదు, 2021 ఏడాదికి గానూ రూ.1,048.94 కోట్లను జమ చేయనున్న ఏపీ సర్కారు, బడ్జెట్‌ను విడుదల చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జగనన్న వసతి దీవెన పథకం (Jagananna Vasathi Deevena Scheme) కింద అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో బుధవారం రూ.1,048.94 కోట్లను జమ చేయనున్నారు. 2020–2021 సంవత్సరానికి మొత్తం 10,89,302 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కడం ద్వారా సీఎం నగదు జమ చేస్తారు.

CM Jagan Lays Foundation for Fishing Harbours (Photo-Twitter)

Amaravati, April 28: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జగనన్న వసతి దీవెన పథకం (Jagananna Vasathi Deevena Scheme) కింద అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో బుధవారం రూ.1,048.94 కోట్లను జమ చేయనున్నారు. 2020–2021 సంవత్సరానికి మొత్తం 10,89,302 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కడం ద్వారా సీఎం నగదు జమ చేస్తారు. దీనికనుగుణంగా బడ్జెట్‌ను విడుదల చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

గత వారం జగనన్న విద్యా దీవెన (Jagananna Vasathi Deevena) కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు మొదటి త్రైమాసికం కింద రూ.671.45 కోట్లు వారి తల్లుల ఖాతాలకు సీఎం జమ చేశారు. ఇప్పుడు వసతి, భోజన ఖర్చులకు రూ.1,048.94 కోట్లు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు చొప్పున, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేల చొప్పున, డిగ్రీ, ఆపై కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున వసతి, భోజన ఖర్చులను చెల్లించేందుకు జగనన్న వసతి దీవెన కార్యక్రమానికి సీఎం రూపకల్పన చేశారు.

ఏపీలో తాజాగా 11,434 మందికి కరోనా, 64 మంది మృతి, కరోనా పరిస్థితులపై రేపు మంత్రుల కమిటీ సమావేశం, వివరాలను వెల్లడించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని

జగనన్న వసతి దీవెన పథకం ద్వారా ఇప్పటికే రూ.1,220.99 కోట్లను చెల్లించారు. బుధవారం మొదటి విడతగా రూ.1,048.94 కోట్లను చెల్లిస్తున్నారు. దీంతో ఇప్పటివరకు జగనన్న వసతి దీవెన కింద రూ.2,269.93 కోట్లు చెల్లించినట్లు అవుతుంది.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Advertisement
Advertisement
Share Now
Advertisement