IPL Auction 2025 Live

Jesus Christ On Receipts: విశాఖ ట్రాఫిక్ పోలీసుల రసీదులపై ఏసుక్రీస్తు బోధనలు.. ఆటోలకు జారీ చేసే రసీదులపై ప్రింట్.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్

ఆ రసీదులపై ఏసు క్రీస్తు బోధనలు ఉండడమే దీనికి కారణం.

Receipt (Credits: Whatsapp)

Visakhapatnam, Nov 26: విశాఖపట్టణం (Visakhapatnam) ట్రాఫిక్ పోలీసులు (Traffic Police) జారీ చేసిన ఆటో రసీదులు వివాదానికి దారితీశాయి. ఆ రసీదులపై ఏసు క్రీస్తు బోధనలు (Jesus Christ Quotes) ఉండడమే దీనికి కారణం. వివరాల్లోకి వెళ్తే.. ఇక్కడి రైల్వే స్టేషన్ ఆవరణలో (Premises of Railway Station) ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆటో స్టాండ్ (Auto Stand Which was under Traffic Police Station) రసీదులపై ఏసు క్రీస్తు బోధనలు ముద్రించి ఉన్నాయి.

శబరిమల భక్తులకు గుడ్ న్యూస్.. మరో 38 ప్రత్యేక రైళ్లను సిద్ధం చేస్తున్న దక్షిణమధ్య రైల్వే.. డిసెంబరు, జనవరి నెలల్లో అందుబాటులోకి

పోలీసులు తమకు జారీ చేసిన రసీదులను కొందరు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యాయి. పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. విషయం తెలిసిన బీజేపీ నేతలు ట్రాఫిక్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పనిమనిషితో శృంగారం చేస్తూ బెడ్‌పైనే మరణించిన వ్యాపారి.. హత్య కేసు తన పీకకు ఎక్కడ చుట్టుకుంటుందోనని భయపడిన మహిళ.. భర్త, సోదరుడి సాయంతో మృతదేహాన్ని నిర్జన ప్రదేశంలో పడేసిన వైనం.. తర్వాత ఏమైంది??

దీనికి పోలీసులు స్పందిస్తూ తమ వద్ద రసీదులు అయిపోవడంతో తమకు ఎప్పుడూ రసీదు పుస్తకాలు ముద్రించి ఇచ్చే వారి నుంచి తమ సిబ్బంది ఓ పుస్తకం తెచ్చారని తెలిపారు. అయితే, వాటిపై ఏసు బోధనలు ఉండడం చూశాక వెంటనే వాటిని జారీ చేయడం ఆపేశామని ట్రాఫిక్ అదనపు డిప్యూటీ కమిషనర్ హరీవుల్లా వివరణ ఇచ్చారు.