Monkey-Women Bonding: ఆకలితో వచ్చినప్పుడల్లా ఆహారం పెట్టే అమ్మ ఆ రోజు కనిపించలేదు. ఆమె మరణించిందని గ్రహించిన ఆ వానరం.. కడచూపు కోసం వైకుంఠ రథం వెనుక పరుగుతీసింది. ప్రతీ ఒక్కరినీ కంటతడి పెట్టిస్తున్న ఘటన.. నంద్యాల జిల్లా డోన్‌లో జరిగింది.. (వీడియోతో)

తనకు రోజూ ఆహారం అందించే ‘అమ్మ’ మరణిస్తే ఆమెను కడసారి చూసేందుకు ఓ వానరం పడిన తాపత్రయం అందరినీ కంటతడి పెట్టించింది. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఈ ఘటన జరిగింది.

Monkey (Credits: Twitter)

Nandyala, October 21: తనకు రోజూ ఆహారం (Food) అందించే ‘అమ్మ’ మరణిస్తే ఆమెను కడసారి చూసేందుకు ఓ వానరం (Monkey) పడిన తాపత్రయం అందరినీ కంటతడి పెట్టించింది. నంద్యాల (Nandyala) జిల్లా డోన్ పట్టణంలోని కొండపేటకు చెందిన లక్ష్మీదేవి తన ఇంటి వద్ద బజ్జీల కొట్టు నిర్వహించేవారు. అక్కడికి రోజూ ఓ కోతి వచ్చేది. దానికి ఆమె ఆహారం పెట్టేవారు. దీంతో ఇద్దరి మధ్య చెలిమి (Friendship) పెరిగింది. ఈ క్రమంలో లక్ష్మీదేవి నిన్న గుండెపోటుకు గురై మరణించారు. కుటుంబ సభ్యులు ఆమెకు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాసేపటికి ఎప్పటిలానే లక్ష్మీదేవి ఇంటికి చేరుకున్న వానరానికి ఆమె కనిపించకపోవడంతో అల్లాడిపోయింది. చుట్టూ చూసింది. ఇంటి ఆవరణలో చూస్తే ఆమె మరణించి ఉండడం, చుట్టూ జనాలు ఉండడంతో దూరంగా ఉండిపోయింది.

జయలలిత మృతి కేసులో అనూహ్య ట్విస్ట్.. ఆసుపత్రిలో వైద్యులతో జయ మాట్లాడిన ఆడియో లీక్.. అర్ముగస్వామి కమిషన్ నివేదిక సమర్పించిన తర్వాత వెలుగులోకి ఆడియో.. సంచలనం సృష్టిస్తున్న జయ చివరి మాటలు.. (ఆడియోతో)

ఆ తర్వాత లక్ష్మీదేవి మృతదేహాన్ని వైకుంఠ రథంలో అంత్యక్రియలకు తరలిస్తుండగా వాహనం వెనకే పరుగులు తీసింది. ఈ దృశ్యం అక్కడి వారిని కదిలించింది. లక్ష్మీదేవిపై అది పెంచుకున్న ప్రేమకు అందరూ కరిగిపోయారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement