NTR Death Anniversary: ఎన్టీఆర్ అంటే ప్రభంజనం..సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ నెంబర్ 1, నివాళులు అర్పించిన నారా లోకేష్, బాలకృష్ణ,భువనేశ్వరి

సీనియర్ ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు ఏపీ మంత్రి నారా లోకేష్, బాలకృష్ణ,

Nara Lokesh, Balakrishna, Laxmi Parvathi pays tributes to NTR

Hyd, Jan 18:  సీనియర్ ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు ఏపీ మంత్రి నారా లోకేష్, బాలకృష్ణ, లక్ష్మి పార్వతి. నందమూరి తారక రామారావు వల్లే ఈరోజు తెలుగు వాళ్లు తలెత్తుకొని తిరుగుతున్నారు అన్నారు నారా లోకేష్.

ఎన్టీఆర్ అంటే కేవలం మూడక్షరాల పేరు కాదు, ఎన్టీఆర్ అంటే ప్రభంజనం అని కొనియాడారు. ఇటు సినిమాల్లో అటు రాజకీయాల్లో ఆయన నెంబర్ వన్ గా నిలిచారు అన్నారు. ప్రజల సంక్షేమం కోసం ఎన్టీఆర్ అనేక గొప్ప సంస్కరణలు తెచ్చారు అని గుర్తుచేశారు లోకేష్.

ఎన్టీఆర్ ఒక ప్రభంజనం అన్నారు నందమూరి బాలకృష్ణ. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారాన్ని చేజిక్కించుకున్నారు అని...సినిమా రంగంలోనైనా, రాజకీయాల్లో నైనా ఆయనను అభిమానులు, కార్యకర్తలు దేవుడిలా కొలిచే వారు అన్నారు. తెలుగు వాళ్లంతా నందమూరి తారక రామారావు కుటుంబమే... ఇప్పటికీ అనేక ప్రభుత్వాలు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాల పేర్లు మార్చి అమలు చేస్తున్నాయి అన్నారు.  నేడు ఎన్టీఆర్ వర్ధంతి.. నివాళులు అర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌ రామ్ (వీడియో) 

నా భర్త ఎలా చనిపోయారో, ఎన్ని కుతంత్రాలు జరిగాయో నాకు తెలుసు అన్నారు లక్ష్మి పార్వతి. గత 30 ఏళ్లుగా పోరాటం చేస్తూ వస్తున్నాను...ఇప్పటికీ ఆ దుర్మార్గుల అరాచకాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి అన్నారు. నేను చేసిన తప్పు ఏంటో ఇప్పటికీ నాకు తెలియదు... అందరి సమక్షంలోనే ఎన్టీఆర్ నన్ను పెళ్లి చేసుకున్నారు అన్నారు. ఏ రోజు ఏ పదవి ఆశించకుండా నిస్వార్ధంగా పని చేశాను... అయినా అవే అబద్ధాలు ఆడుతూ నా జీవితాన్ని ఇంకా నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారు అన్నారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Advertisement
Advertisement
Share Now
Advertisement