Nellore Street Fight: బజారెకెక్కిన అక్రమ సంబంధం, నడిరోడ్డు మీద ఇద్దరూ తన్నుకుంటున్న వీడియో వైరల్, అనంతరం నెల్లూరు జిల్లా ఎస్ఫీకి ఫిర్యాదు చేసిన యువతి

ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఓ వివాహేతర సంబంధం నడిరోడ్డు మీద కొట్టుకునేదాకా (Nellore Street Fight) వెళ్లింది.. ఈ ఫైట్ విషయంలోకి వెళితే..నెల్లూరు నగరానికి చెందిన హోమియోపతి డాక్టర్ బాలకోటేశ్వరరావుకు తన దగ్గర పనిచేస్తున్న మహిళతో వివాహేతర సంబంధం (woman reveals extramarital affair with doctor) పెట్టుకున్నాడు.

Nellore Street Fight (Photo-Video Grab)

ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఓ వివాహేతర సంబంధం నడిరోడ్డు మీద కొట్టుకునేదాకా (Nellore Street Fight) వెళ్లింది.. ఈ ఫైట్ విషయంలోకి వెళితే..నెల్లూరు నగరానికి చెందిన హోమియోపతి డాక్టర్ బాలకోటేశ్వరరావుకు తన దగ్గర పనిచేస్తున్న మహిళతో వివాహేతర సంబంధం (woman reveals extramarital affair with doctor) పెట్టుకున్నాడు. వీరిద్దరి మధ్య కొన్నాళ్లపాటు ఈ ఎఫైర్‌ కొనసాగింది. అయితే ఇటీవల మహిళను డాక్టర్‌ బాలకోటేశ్వరరావు దూరం పెడుతూ వస్తున్నాడు.

దీంతో సదరు మహిళ.. తనను ఎందుకు కలవడం లేదని అతని ఆస్పత్రికి వెళ్లి నిలదీసింది. ఎందుకు దూరం పెడుతున్నావని ప్రశ్నించింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. డాక్టర్‌, మహిళ మధ్య మాటామాటా పెరిగి ఇరువురు పరస్పర దాడులకు దిగారు. కోపంతో చెలరేగిన మహిళ కోటేశ్వరరావును చొక్కాపట్టుకొని రోడ్డుపైకి లాక్కొచ్చింది.

శాడిస్ట్ భర్త, పొట్టి దుస్తులు వేసుకోవాలని భార్యకు వేధింపులు, ఇంట్లోనే ఉండాలని అత్తామామల పోరు, ఇద్దరి వేధింపులు తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

అందరూ చూస్తుండగానే రోడ్డుపై పరస్పరం కొట్టుకున్నారు. అనంతరం సదరు మహిళ జిల్లా ఎస్పీ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా రోడ్డుపై ఇద్దరూ కొట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement