Anakapally Pharma Accident: అనకాపల్లిలో మరో ప్రమాదం.. పరవాడ సినర్జీస్‌ ఫార్మా లో రసాయనాలు కలుపుతుండగా ఘోరం.. నలుగురికి గాయాలు

ఏపీలోని ఫార్మా కంపెనీల్లో వరుస ప్రమాదాలు కలకలం సృష్టిస్తోంది. అనకాపల్లిలో గురువారం అర్థరాత్రి మరో ప్రమాదం జరిగింది. పరవాడ జవహర్‌ లాల్‌ నెహ్రూ ఫార్మాసిటీలోని సినర్జిన్‌ యాక్టివ్‌ ఇన్‌గ్రెడియంట్స్‌ సంస్థలో ఘోరం జరిగింది.

Anakapalle Pharma Accident (Credits: X)

Vijayawada, Aug 23: ఏపీలోని (AP) ఫార్మా కంపెనీల్లో (Pharma Companies) వరుస ప్రమాదాలు కలకలం సృష్టిస్తోంది. అనకాపల్లిలో (Anakapalle) గురువారం అర్థరాత్రి మరో ప్రమాదం జరిగింది. పరవాడ జవహర్‌ లాల్‌ నెహ్రూ ఫార్మాసిటీలోని సినర్జిన్‌ యాక్టివ్‌ ఇన్‌గ్రెడియంట్స్‌ సంస్థలో ఘోరం జరిగింది. రసాయనాలు కలుపుతుండగా నలుగురు కార్మికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే విశాఖ నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా బాధితులు జార్ఖండ్ కు చెందినవారిగా సమాచారం.

ప్రేమ వ్యవహారం..ఫ్రెండ్‌ అని చూడకుండా చంపేసిన స్నేహితులు, బాలాపూర్‌లో దారుణం, ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో ఆ తల్లిబాధ వర్ణనాతీతం

ప్రమాదంపై సీఎం ఆరా

ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇటీవల ఇదే జిల్లా అచ్యుతాపురం సెజ్‌ లోని ఫార్మా పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో 17 మంది మృతి చెందిన విషయం విదితమే.

మేనకోడలిని పెళ్లి చేసుకున్న మామ, ప్రేమలో పడటం తప్పుకాదని సమర్థించిన యువతి, ప్రభుత్వం తమను వదిలివేయాలని ఆవేదన, వీడియో ఇదిగో..

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement