Rajendranath Reddy Take Charge As AP New DGP: నేడు ఆంధ్రప్రదేశ్ డీజీపీగా బాధ్యతలను స్వీకరించనున్న రాజేంద్రనాధ్ రెడ్డి

ఆయన డీజీపీగా అదనపు బాధ్యతలను చేపట్టనున్నారు.

నేడు ఏపీ డీజీపీగా బాధ్యతలు తీసుకోనున్న రాజేంద్రనాథ్ రెడ్డి

విజయవాడ, ఫిబ్రవరి 19: ఆంధ్రప్రదేశ్ డీజీపీగా రాజేంద్ర నాధ్ రెడ్డి నేడు బాధ్యతలను స్వీకరించనున్నారు. ఆయన డీజీపీగా అదనపు బాధ్యతలను చేపట్టనున్నారు. రాజేంద్ర నాధ్ రెడ్డిది కడప జిల్లా. 1992కు చెందిన రాజేంద్ర నాధ్ రెడ్డి తొలుత నిజామాబాద్ జిల్లా బోధన్ ఏఎస్సీగా పనిచేశారు. అక్కడి నుంచి తెలంగాణలో వరంగల్, జనగాం ఏఎస్పీగా పనిచేశారు. అనంతరం విశాఖ రూరల్ ఎస్పీగా పనిచేశారు. రైల్వే ఎస్సీగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఇంటలిజెన్స్ చీఫ్ గా ఉన్నారు.

'The Great CM Yogi': దటీజ్ యోగీ, నిరసనకారులు ఏడుస్తున్నారు, ప్రభుత్వ నిర్ణయంతో షాకవుతున్నారు, ట్వీట్ చేసిన యోగీ ప్రభుత్వ కార్యాలయం, మానవ హక్కుల ఉల్లంఘనపై వివరణ ఇవ్వండి, యూపీ పోలీస్ చీఫ్‌కు నోటీసులు జారీ చేసిన మానవ హక్కుల కమిషన్

ఇదిలా ఉంటే ప్రస్తుతం డీజీపీగా ఉన్న గౌతం సవాంగ్ ను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయనకు ఏపీపీఎస్సీ ఛైర్మన్ పోస్టు ఇవ్వాలని నిర్ణయించింది. ఆ పోస్టులో ఉండాలంటే గౌతం సవాంగ్ తన సర్వీస్ కు రాజీనామా చేయాల్సి ఉంటుంది. మరో ఏడాదిన్నర పాటు గౌతం సవాంగ్ కు సర్వీసు ఉంది. దీంతో ఆయన ఉద్యోగానికి రాజీనామా చేస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.