Road Accident In Prakasam: ప్ర‌కాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం, ఆటోను ఢీకొట్టిన కారు, అక్క‌డికక్క‌డే న‌లుగురు మృతి

కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు, ఆటోలో ఉన్న మరో ఇద్దరు మెత్తం నలుగురు దుర్మరణం చెందారు. మృతులను(కారులో ప్రయాణిస్తున్న వారు) గుంటూరుకు చెందిన నాగేశ్వరరావు రావు, వెంకటేశ్వర్లు.. ఆటోలో ప్రయాణిస్తున్న మార్కాపురంకు చెందిన మాబు(ఆటో డ్రైవర్), దుపాడుకు చెందిన అభినయ్(11) గా గుర్తించారు. ఈ నలుగురు స్పాట్ లోనే ప్రాణాలు విడిచారు

Representative Image

Praksham, DEC 22: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. స్పాట్ లోనే నలుగురు చనిపోయారు. పెద్దారవీడు మండలం దేవరాజు గట్టు గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను మార్కాపురం (Markapuram) జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు, ఆటోలో ఉన్న మరో ఇద్దరు మెత్తం నలుగురు దుర్మరణం చెందారు.

Andhra Pradesh: నారా లోకేశ్‌పై సీఐడీ మరో పిటిషన్, స్కిల్‌ స్కాం కేసు దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు ఉన్నాయని ఏసీబీ కోర్టుకు తెలిపిన సీఐడీ 

మృతులను(కారులో ప్రయాణిస్తున్న వారు) గుంటూరుకు చెందిన నాగేశ్వరరావు రావు, వెంకటేశ్వర్లు.. ఆటోలో ప్రయాణిస్తున్న మార్కాపురంకు చెందిన మాబు(ఆటో డ్రైవర్), దుపాడుకు చెందిన అభినయ్(11) గా గుర్తించారు. ఈ నలుగురు స్పాట్ లోనే ప్రాణాలు విడిచారు. ఆటోలోని వారికి తీవ్రగాయాలు కావడంతో మార్కాపురం జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొమరోలు నుంచి గుంటూరుకు వెళ్తున్న కారు.. హైవేపై వేగంగా వస్తున్న ఆటో ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

Hyderabad Fire Video: వీడియో ఇదిగో, పంజాగుట్ట అగ్ని ప్రమాదంలో తలుపులు పగులగొట్టి కుటుంబాన్ని రక్షించిన పోలీసులు 

ఆటోలో 7మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఇద్దరు స్పాట్ లోనే మృతి చెందారు. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారిలో ముగ్గురు అగ్రికల్చర్ కాలేజీ విద్యార్థులు ఉన్నారు. నాలుగు మృతదేహాలను మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement