టీడీపీ నేత నారా లోకేష్ వ్యాఖ్యలపై ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ మెమో దాఖలు చేసింది. లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఆధారాలతో సహా ఏసీబీ కోర్టుకు సీఐడీ అందజేసింది. కాగా యువగళం ముగింపు సందర్బంగా పలు మీడియా ఛానెళ్ల ఇంటర్వ్యూలలో లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు స్కిల్ స్కాం కేసు దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యానించారని మొమోలో పేర్కొంది.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేశ్‌కు ఎన్‌బీడబ్ల్యూ (NBW) జారీచేయాలని, ఈ కేసులో ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఐఆర్ఆర్ కేసులో 41ఏ నోటీస్ నిబంధనలను లోకేశ్ ఉల్లంఘించారని ఆరోపించింది. సాక్ష్యాలు ఏమిటని న్యాయమూర్తి ప్రశ్నించగా .. పత్రికల క్లిప్పింగ్‌లను సీబీఐ తరపు న్యాయవాది చూపించారు.
Here's News
#Breaking: AP CID files a memo in #Vijayawada ACB court against @naralokesh for a non-bailable warrant. #NaraLokesh has been added as #A14 in the inner ring road alignment case of #Amaravati and has been questioned by the #APCID after serving 41-A notices in #Oct.@TheSouthfirst pic.twitter.com/yKbb3b2wCw
— Bhaskar Basava (@bhaskar_basava_) December 22, 2023
లోకేశ్‌ను అరెస్టు చేసేందుకు అనుమతి ఇవ్వాలని, రెడ్ బుక్ పేరుతో అధికారులను లోకేశ్ బెదిరిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొంది. 41ఏ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునే అధికారం కోర్టుకు ఉండదని పిటిషన్‌లో సీఐడీ పేర్కొంది. కాగా ఈ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు జడ్జి శుక్రవారం సాయంత్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
డ్డారని.. తమ అభ్యంతరాలని పట్టించుకోలేదని టీడీపీ ప్రభుత్వంలో ఉన్న ఉన్నతాధికారులు ఇప్పటికే న్యాయమూర్తి ఎదుట 164 సీఆర్‌పీసీ క్రింద వాంగ్మూలం ఇచ్చారు. అయితే ఆ వాంగ్మాలాలు ఇవ్వడాన్ని లోకేష్ తప్పుబడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అధికారులు 164 సీఆర్‌పీసీ కింద వాంగ్మూలం ఎలా ఇస్తారని.. రెడ్ బుక్‌లో పేర్లు రికార్డు చేశానని, తమప్రభుత్వం వస్తే వారి సంగతి తేలుస్తానంటూ లోకేష్ హెచ్చరించారని తెలుస్తోంది.