Vishakhapatnam, DEC 20: సీఎం జగన్ పాలనలో అమరావతి పూర్తిగా నిర్వీర్యమైపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అన్నారు. అమరావతి విధ్యంసమైపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం (Yuvagalam) పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద యువగళం-నవశకం పేరుతో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో చంద్రబాబు మాట్లాడారు. పాదయాత్రలో లోకేశ్ ప్రజల సమస్యలను అధ్యయనం చేశారని చంద్రబాబు అన్నారు. ఒక్క చాన్స్ అంటూ జగన్ (YS Jagan) రాష్ట్రాన్ని ముప్పై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసే అధికారం ఎవరికీ లేదని అన్నారు. మెడపై కత్తి పెట్టి ఆస్తులు లాక్కుంటున్నారని చెప్పారు.
యువగళంపై ప్రభుత్వ కక్ష సాధింపు.. వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం - @ncbn గారు ..
#NavaSakamBegins #AndhraPradesh #YuvaGalamPadayatra #NaraChandrababuNaidu #NaraLokesh pic.twitter.com/nruqwZ73rP
— iTDP Official (@iTDP_Official) December 20, 2023
ఉత్తరాంధ్ర వైసీపీ కబ్జాలో నలిగిపోయిందన్నారు. విశాఖ రుషికొండను బోడిగుండుగా మార్చారని, సీఎం విల్లా కోసం రూ. 500 కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు. ఏపీకి రాజధాని లేకపోవడం సిగ్గుచేటని అన్నారు. ప్రస్తుతం విశాఖ గంజాయి రాజధానిగా మారిందని దుయ్యబట్టారు.
వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌గా మారేందుకు కృషి చేస్తామని అన్నారు. ఏపీలో ధరలు విఫరీతంగా పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో అధికారం కోసం కాదని, . ముఖ్యమంత్రి పదవుల కోసం తపించడం లేదని, రాష్ట్రంలో ఖూనీ చేయబడ్డ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు జత కడుతున్నామని పేర్కొన్నారు. తిరుపతి, అమరావతిలో ఉమ్మడి సభలు పెట్టి టీడీపీ, జనసేన ఉమ్మడి ఎన్నికల మానిఫెస్టోను ప్రకటిస్తామని చంద్రబాబు తెలిపారు.