IPL Auction 2025 Live

Skill Development Scam Case: గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న చంద్రబాబు, బెయిల్‌ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా

ఇవాళ హైకోర్టులో సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి వాదనలు వినిపించారు.

chandrababu (Photo-PTI)

Vjy, Nov 15: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ గురువారానికి వాయిదా పడింది. ఇవాళ హైకోర్టులో సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి వాదనలు వినిపించారు. మరోవైపు చంద్రబాబు కంటి ఆపరేషన్‌, ఆరోగ్య పరిస్థితి వివరాలను ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టుకు సమర్పించారు. వైద్యుల సూచనల మేరకు నివేదికను మెమో ద్వారా కోర్టుకు అందించారు.

పల్నాడుకు కృష్ణమ్మ జలాలు అందించబోతున్నామని తెలిపిన సీఎం జగన్, వరికపుడిశెల ఎత్తిపోతల పథకం పనులకు శంకుస్థాపన చేసిన ఏపీ ముఖ్యమంత్రి

చంద్రబాబు కుడి కంటికి శస్త్రచికిత్స నిర్వహించాం. ఆయన కోలుకోవడానికి తప్పనిసరిగా మందులు వాడాలి. ఐదు వారాల పాటు ఐ చెకప్‌ కోసం షెడ్యూల్‌ ఇచ్చాం. కంటికి 5 వారాల పాటు ఇన్‌ట్రా ఆక్యులర్‌ ప్రెజర్‌ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. 5 వారాల పాటు కంట్లో చుక్కల మందులు వేసుకోవాలి. చంద్రబాబు గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. గుండె పరిమాణం పెరిగింది. గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో సమస్యలున్నాయి.

దమ్ముంటే పులివెందులలో పోటీ చేసి గెలవండి, ఆ ముగ్గురికి సవాల్ విసిరిన మాజీ వైసీపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

మధుమేహం అదుపులో ఉంది.. జాగ్రత్తలు పాటించాలి. ఆయనకు తగినంత విశ్రాంతి అవసరం’’ అని వైద్యులు సూచించిన నివేదికను కోర్టుకు అందించారు. తదుపరి విచారణ రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు వింటామని ధర్మాసనం తెలిపింది.