Andhra Pradesh: చంద్రబాబు నాయుడు రోడ్ షోలో అపశృతి, డ్రైనేజీలో పడిపోయిన కార్యకర్తలు, ఏడుమంది మృతి, మరికొందరికి గాయాలు, మృతుల కుటుంబాలకు టీడీపీ పార్టీ తరఫున రూ.10లక్షల ఆర్థిక సాయం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్న నెల్లూరు జిల్లా కందుకూరు సభలో అపశృతి చోటు చేసుకుంది. కార్యకర్తలు భారీగా తరలి రావడంతో తోపులాట జరిగి కొందరు కార్యకర్తలు డ్రైనేజీలో పడిపోయారు. అప్రమత్తమైన తెదేపా నేతలు గాయపడిన కార్యకర్తలను వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఏడుగురు మృతి చెందినట్టు సమాచారం.

Chandra Babu Road Show (Photo-Video Grab)

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్న నెల్లూరు జిల్లా కందుకూరు సభలో అపశృతి చోటు చేసుకుంది. కార్యకర్తలు భారీగా తరలి రావడంతో తోపులాట జరిగి కొందరు కార్యకర్తలు డ్రైనేజీలో పడిపోయారు. అప్రమత్తమైన టీడీపీ నేతలు గాయపడిన కార్యకర్తలను వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఏడుగురు మృతి చెందినట్టు సమాచారం.

టీ ఇవ్వలేదని చపాతీ కర్రతో భార్యను చంపిన భర్త, మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం, మరో ఘటనలో రెండో భార్యను మొదటి భార్య అంగీకరించలేదని ప్రియురాలతో కలిసి ప్రియుడు ఆత్మహత్య

వెంటనే చంద్రబాబు నాయుడు తన ప్రసంగం ఆపేసి.. ఆసుపత్రి వెళ్లి బాధితులను పరామర్శించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. కందుకూరులో ఇలాంటి దుర్ఘటన జరగడం తన మనసు కలచివేసిందన్నారు. అమాయకులు చనిపోవడం బాధ కలిగిస్తోందన్నారు. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్టు ప్రకటించారు.

Here's Video

బహిరంగ సభను సంతాప సభగా ప్రకటించిన చంద్రబాబు.. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బాధితుల పిల్లలను ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ విద్యాసంస్థల్లో చదివిస్తామన్నారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement