Ignazio Cassis on AP Education System: ఏపీ విద్యావిధానంపై అంతర్జాతీయంగా ప్రశంసలు, వైయస్ జగన్ సర్కారు విద్యావిధానం భేష్‌ అంటూ స్విట్జర్లాండ్ మాజీ అధ్యక్షుడి కితాబు

జెనీవాలో ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో ఇంటర్నేషనల్‌ కో ఆపరేషన్‌ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన 'ఎడ్యుకేషన్‌ ఫర్‌ ఫ్యూచర్‌' కార్యక్రమానికి క్యాసిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కరోనా సమయంలో చాలా దేశాలు విద్యారంగంలో పెద్ద సవాళ్లను ఎదుర్కొంటుంటే.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అలాంటి పరిస్థితులు ఉన్నాయని కొనియాడారు.

YS Jagan (Photo-Twitter)

New Delhi, FEB 25: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యావిధానంపై అంతర్జాతీయంగా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇప్పటికే సంక్షేమ కార్యక్రమాలతో అందరికి చేరువైన వైయస్ జగన్మోహన్‌ రెడ్డి (YS Jaganmohan reddy) ప్రభుత్వం, ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. నాడు-నేడు (Nadu -Nedu), విద్యా దీవెన (Vidya deevena), వసతి దీవెన(Vasthi deevena).. ఇలా విద్య కోసం చాలా కార్యక్రమాలను చేపడుతున్నారు. అయితే ఏపీలో విద్యా వ్యవస్థలో మార్పులు.. అద్భుతమని ప్రశంసించారు స్విట్జర్లాండ్‌ మాజీ దేశాధ్యక్షుడు ఇగ్నాజియో క్యాసిస్‌ (Switzerland President Ignazio Cassis). జెనీవాలో ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో ఇంటర్నేషనల్‌ కో ఆపరేషన్‌ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన 'ఎడ్యుకేషన్‌ ఫర్‌ ఫ్యూచర్‌' కార్యక్రమానికి క్యాసిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కరోనా సమయంలో చాలా దేశాలు విద్యారంగంలో పెద్ద సవాళ్లను ఎదుర్కొంటుంటే.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అలాంటి పరిస్థితులు ఉన్నాయని కొనియాడారు.

సీఎం జగన్ రాష్ట్రంలోని పేద విద్యార్థుల కోసం చేపట్టిన పథకాలు, కార్యక్రమాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయని అభినందించారు. మరీ ముఖ్యంగా.. రాష్ట్రంలోని పాఠశాలల రూపు రేఖల్ని మార్చేస్తూ తీసుకొచ్చిన నాడు-నేడు కార్యక్రమం.. కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా అద్భుతంగా తీర్చి దిద్దారని కితాబిచ్చారు. రాష్ట్రంలో స్కూళ్లకు వెళ్లే విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వమే సమకూర్చడం ప్రశంసనీయమన్నారు జియో క్యాసిన్. ఏపీ విద్యార్థులు రాబోయే రోజుల్లో కచ్చితంగా అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారని, ప్రతిభావంతులుగా నిలుస్తారన్నారు.

Investments In AP: పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఏపీ శ్రామికశక్తి.. జనాభాలో 70 శాతం మంది వర్కింగ్ పాపులేషనే.. 

ఎడ్యుకేషన్‌ ఫర్‌ ఫ్యూచర్‌ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పథకాల స్టాల్‌ అందర్ని ఆకట్టుకుంది. స్వయంగా దేశాధ్యక్షుడిగా పనిచేసిన ఇగ్నాజియో ఏపీ విద్యా విధానాలపై ప్రశంసలు కురిపించడంతో ఏపీపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే స్విట్జర్లాండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ జనరల్‌ పాట్రిసియా దన్జీ ఆంధ్రప్రదేశ్ స్టాల్‌ను సందర్శించారు. ఏపీలో అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల గురించి దన్జీ ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. మరీ ముఖ్యంగా నాడు–నేడులో తీసుకున్న నిర్ణయాలు, అమలవుతున్న తీరు, విద్యా ప్రమాణాలు వంటి అంశాలపై ఏపీ ప్రభుత్వాన్ని అభినందించారు.

Andhra Pradesh: ఎండాకాలంలో కరెంటు కోతలు అనే మాట వినపడకూడదు, అన్ని రకాలుగా సిద్ధం కావాలని అధికారులకు సీఎం జగన్ సూచన, ఇంధనశాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి 

స్కూళ్ల ఆధునీకరణ, విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేయడం, అలాగే డిజిటల్ లెర్నింగ్, డిజిటల్‌ బోర్డులు, సరికొత్త పద్ధతుల్లో విద్యా బోధన వంటి కార్యక్రమాలన్నీ పేద విద్యార్థులకు ఎంతో మేలు చేస్తాయని ప్రశంసించారు. అలాగే విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో నాణ్యమైన భోజనం అందించడం అద్భుతమన్నారు. ముఖ్యంగా ఈక్విటబుల్‌ ఎడ్యుకేషన్‌ యాక్సెస్‌ టు ఆల్‌ విధానం చాలా బావుందన్నారు. అలాగే ఇంటర్నేషనల్‌ యూనిసెఫ్‌ ప్రోగ్రామ్స్‌ స్పెషలిస్ట్‌ అతెనా లౌబాచెర్‌ ఆంధ్రప్రదేశ్ స్టాల్‌ను సందర్శించారు. డిజిటల్‌ ఎడ్యుకేషన్లో భాగంగా బైజూస్‌ ద్వారా అందిస్తున్న విద్యా విధానం గొప్పగా ఉందని ప్రశంసించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement