Guntur Shocker: ఇద్దరు చిన్నారులపై అత్యాచారం, చంపి మళ్లీ రేప్ చేసిన కామాంధుడు, నిందితుడిని అరెస్ట్ చేసిన తాడేపల్లి పోలీసులు, గుంటూరు అమానుష ఘటన కేసు వివరాలను వెల్లడించిన అర్బన్‌ ఎస్పీ ఆర్‌ఎన్‌ అమ్మిరెడ్డి

తాడేపల్లి మండలంలోని మెల్లెంపూడి, వడ్డేశ్వరం గ్రామాల్లో కలకలం రేపిన కేసు (Child Assassination Case) వివరాలను గుంటూరులో శుక్రవారం జరిగిన విలేకర్ల సమావేశంలో అర్బన్‌ ఎస్పీ ఆర్‌ఎన్‌ అమ్మిరెడ్డి (Urban SP RN Ammireddy) వెల్లడించారు.

stop rape Rape accused| Representational Image (Photo Credits: File Image)

Amaravati, Mar 20: గుంటూరులో ఇద్దరు చిన్నారుల హత్యకేసు మిస్టరీ వీడింది.అభం, శుభం తెలియని ఇద్దరు బాలురపై సైకోలా మారి అత్యాచారం చేసి ఆపై కిరాతకంగా హత్య చేసిన నిందితుడిని తాడేపల్లి పోలీసులు అరెస్ట్‌ (Tadepalli police Arrested) చేశారు. తాడేపల్లి మండలంలోని మెల్లెంపూడి, వడ్డేశ్వరం గ్రామాల్లో కలకలం రేపిన కేసు (Child Assassination Case) వివరాలను గుంటూరులో శుక్రవారం జరిగిన విలేకర్ల సమావేశంలో అర్బన్‌ ఎస్పీ ఆర్‌ఎన్‌ అమ్మిరెడ్డి (Urban SP RN Ammireddy) వెల్లడించారు.

ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం. తాడేపల్లి మండలం మెల్లెంపూడి గ్రామానికి చెందిన కుర్రా భార్గవ్‌తేజ (6) ఈ నెల 14న అదృశ్యం కాగా, మరుసటిరోజు ఇంటికి దగ్గరలో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహంపై గాయాలు ఉండటంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. వడ్డేశ్వరం గ్రామాల్లో ఇదే విధంగా మరో బాలుడు అదృశ్యమయ్యారు. ఈ నేపథ్యంలో తాడేపల్లి పోలీసులు ఈ రెండు కేసులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి దర్యాప్తు ముమ్మరం చేయడంతో నిందితుడు పట్టుబడ్డాడు.

విచారణలో భాగంగా అదే గ్రామానికి చెందిన నిందితుడు మెల్లంపూడి గోపయ్య అలియాస్‌ గోపి (19) ఏమీ తెలియనట్టు పోలీసులకు సహకరిస్తున్నట్టు నటించి, తప్పుదోవ పట్టించాడు. అయితే సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా గోపి నిందితుడని గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేసి విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి.

సెక్స్ కోసం వేధిస్తున్నాడని తొలి భర్తని కుర్చీకి కట్టేసి చంపేసింది, నాగపూర్‌లో కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేసిన యువతి, సీసీటీవీ పుటేజీ సాయంతో నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు

గత నెల 11న వడ్డేశ్వరం గ్రామానికి చెందిన బండి అఖిల్‌ (8) కూడా అదృశ్యం కాగా, పోలీసులు దర్యాప్తు చేపట్టినా ఆచూకీ తెలియలేదు. బకింగ్‌ హామ్‌ కెనాల్‌లో పడి ఉంటాడని భావించి విస్తృతంగా గాలింపు చేపట్టినా ఫలితం లేకపోయింది. భార్గవతేజ కేసు తీరులోనే ఇదీ ఉండటంతో పోలీసులు గోపిని విచారించగా, అఖిల్‌ను కూడా తానే హతమార్చినట్టు అంగీకరించాడు. ఇద్దరినీ మాయమాటలు చెప్పి తీసుకెళ్లి, వారిపై లైంగిక దాడికి పాల్పడినట్టు, అనంతరం గొంతు నులిమి చంపేసినట్టు చెప్పాడు. మృతిచెందిన తర్వాత కూడా మరోసారి లైంగిక దాడికి పాల్పడినట్టు తెలిపాడు.

దారుణ నేరాలకు పాల్పడిన నిందితుడిపై వీలైనంత త్వరగా చార్జిషీట్‌ దాఖలు చేసి కఠినంగా శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు ప్రత్యేక బృందాలతో అఖిల్‌ మృతదేహం కోసం బకింగ్‌ హామ్‌ కాల్వలో గాలిస్తున్నట్టు చెప్పారు. దర్యాప్తులో భాగంగా మెల్లెంపూడి గోపిపై అనుమానంతో అతని ఆచూకీ కోసం ప్రయత్నిస్తుండగా, గ్రామ వీఆర్‌ఓ ద్వారా పోలీస్‌స్టేషన్‌లో హాజరయ్యాడని వెల్లడించారు.

అమానుషం, నాలుగేళ్ల చిన్నారిపై 80 ఏళ్ల వృద్ధులు లైంగిక దాడి, పదేళ్ల జైలుశిక్ష, రూ. 50 వేల జరిమానా విధించిన పోక్సో కోర్టు, 2013లో జరిగిన దారుణ ఘటనపై తాజాగా తీర్పు ఇచ్చిన న్యాయస్థానం

కాగా నిందితుడు గోపీలో సైకో స్వభావాలున్నట్టు పోలీసులు గుర్తించారు. అతడు 14 ఏళ్ల వయసులో (సుమారు ఐదేళ్ల క్రితం) తన స్నేహితుడిని సెకండ్‌ షో సినిమాకు తీసుకువెళ్లి ఇదే తరహాలో హతమార్చినట్టు తెలుస్తోంది. సినిమా మధ్యలో స్నేహితుణ్ణి బయటకు తీసుకొచ్చిన గోపీ అతడిపై లైంగిక దాడి చేసి చంపి, మృతదేహాన్ని రేవేంద్రపాడు బ్రిడ్జి మీద నుంచి బకింగ్‌హామ్‌ కెనాల్‌లో పడేసినట్టు గ్రామస్తులు చెబుతుంటారు. అప్పట్లో కాలనీ వాసులంతా జరిగిందేదో జరిగిపోయింది కేసులు వరకు ఎందుకు, పిల్లాడి భవిష్యత్‌ నాశనం చేయడం ఎందుకంటూ మృతి చెందిన బాలుడి తండ్రిని బుజ్జగించడంతో అప్పట్లో కేసు నమోదు కాలేదనే ప్రచారం ఉంది.

నిందితుడు తన సహచరులతో కలిసి స్వలింగ సంపర్కం చేసేవాడని, వారిని కూడా గుర్తించి సాక్షులుగా చూపుతామన్నారు. ఈ కేసుల ఛేదనలో ప్రతిభ చూపిన అర్బన్‌ ఏఎస్పీ ఈశ్వరరావు, డీఎస్పీ దుర్గప్రసాద్, తాడేపల్లి పీఎస్‌ సీఐలు బి.అంకమ్మరావు, ఎం.సుబ్రహ్మణ్యం, ఎస్‌ఐలు బాలకృష్ణ, నారాయణ, జైత్యానాయక్, హెచ్‌సీ తిరుమలరావు, కానిస్టేబుళ్లు సుబ్బారావు, కల్యాణ్, సాంబశివరావు, విష్ణుమూర్తిలకు ఎస్పీ అమ్మిరెడ్డి రివార్డులు అందజేశారు. తల్లిదండ్రులు చిన్నారుల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

గోపీ తండ్రిది కూడా నేర ప్రవృత్తేనని గ్రామస్తులు చెబుతున్నారు. అతడు మొదటి భార్యను హత్య చేసిన కేసులో 14 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాడు. జైలు నుంచి వచ్చాక మరో మహిళను వివాహం చేసుకున్నాడు.