Mumbai Shocker: అమానుషం, నాలుగేళ్ల చిన్నారిపై 80 ఏళ్ల వృద్ధులు లైంగిక దాడి, పదేళ్ల జైలుశిక్ష, రూ. 50 వేల జరిమానా విధించిన పోక్సో కోర్టు, 2013లో జరిగిన దారుణ ఘటనపై తాజాగా తీర్పు ఇచ్చిన న్యాయస్థానం
stop rape Rape accused| Representational Image (Photo Credits: File Image)

Mumbai, Mar 13: ఎనిమిదేళ్ల క్రితం నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో ముంబై ప్రత్యేక పోక్సో న్యాయస్థానం 80 ఏళ్ల వృద్ధ దంపతులకు శిక్ష ఖరారు చేసింది. ఇద్దరికీ పదేళ్ల జైలుశిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ. 50 వేల చొప్పున జరిమానా (10-year jail for sexual assault on 4-year-old girl) విధించింది. ఈ మేరకు.. పోక్సో కోర్టు న్యాయమూర్తి రేఖా పంఢారే గురువారం తీర్పునిచ్చారు. దారుణ ఘటన వివరాల్లోకెళితే.. ముంబైలోని గిర్గాన్‌ ప్రాంతంలో నివసించే భార్యభర్తలు తమ అపార్టుమెంటులో నివసించే నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డారు.

సెప్టెంబరు 4, 2013న పక్కింట్లో ఉన్న తన స్నేహితురాలితో ఆడుకునేందుకు చిన్నారి బయటకు రాగా, ఆమెను తన ఇంట్లోకి తీసుకువెళ్లిన నిందితుడు(87) ఊయలలో కూర్చోబెట్టి కాసేపు ఆడించాడు. ఆ తర్వాత తన భార్య(80)ను పిలిచి, ఇద్దరూ కలిసి చిన్నారి దుస్తులు విప్పి వికృత చేష్టలకు పాల్పడ్డారు. చిన్నారి ఏడుస్తూ వారిని విడిపించుకునేందుకు ప్రయత్నించగా, చెంపలపై కొడుతూ అమానుషంగా ప్రవర్తించారు. ఆ తరువాత ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని బెదిరించారు.

జీవితం మీద విరక్తితో వ్యక్తి ఆత్మహత్య, మరోచోట ఒంటిపై పెట్రోల్ పోసుకుని భార్యను కౌగిలించుకున్నాడు, మంటల్లో ఇద్దరూ సజీవదహనం, అనాధగా మారిన కొడుకు

అయితే, రాత్రి నిద్రపోయే సమయంలో చిన్నారి దారుణ ఘటనను గుర్తుకు తెచ్చుకుని వింతగా ప్రవర్తించడంతో ఆమె తల్లి పరీక్షించి చూడగా, చిన్నారి శరీర భాగాల్లో గాయాలు కనిపించాయి. దీంతో తన భర్తకు విషయం చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేయగా, అసలు విషయం బయటపడింది. దాదా, దాదీ అంటూ పిలిచే ఆ పసిపాపపై వృద్ధ జంటే అత్యాచారానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. దీంతో వారిని అరెస్టు చేసిన పోలీసులు, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

బాధితురాలి తల్లితో పాటు మరికొంత మంది సాక్షులను విచారించిన అనంతరం న్యాయస్థానం గురువారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. బామ్మాతాతయ్యల్లా చిన్నారిని రక్షించాల్సిన వాళ్లే ఈ దురాగతానికి పాల్పడటం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది.